telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

పక్క రాష్ట్రం సినిమాకు థియేటర్లు కావాలంటే… : దిల్ రాజు

Dil-Raju

రాష్ట్రాల్లోని థియేటర్లన్నీ ప్రముఖ నిర్మాతల కనుసైగల్లోనే నడుస్తాయని, వారు చెప్పిన సినిమాలకే థియేటర్లు కేటాయిస్తారని, అల్లు అరవింద్, దిల్ రాజు, యువి క్రియేషన్స్ వారు “పేట” సినిమాకు థియేటర్లు ఇవ్వకుండా ఇబ్బందికి గురి చేస్తున్నారని “పేట” తెలుగు నిర్మాత అశోక్ వల్లభనేని నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో అల్లు అరవింద్, దిల్ రాజు, యువి క్రియేషన్స్ వారిపై మండిపడ్డాడు. ఈ కుక్కలకు బుద్ధి చెప్పాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై అల్లు కాంపౌండ్ నుంచి నిర్మాత బన్నీ వాసు సోషల్ మీడియా ద్వారా “పేట” నిర్మాతలకు వార్నింగ్ లాంటి సమాధానం ఇచ్చాడు.

ఇప్పుడు దిల్ రాజు కూడా ఈ విషయంపై స్పందించారు. వారు తొందరపడి స్టేట్ మెంట్ ఇచ్చారేమో తెలీదుకానీ… ఇప్పుడు విడుదల కాబోతున్న 3 భారీ సినిమాలు 6 నెలల క్రితమే సినిమా విడుదల తేదీని ప్రకటించాయని, అయినప్పటికీ థియేటర్లు ఎలా సర్దుకోవాలో తెలియక ఇప్పటికీ ఇబ్బంది పడుతున్నామని, పక్కరాష్ట్రం సినిమాను 20 రోజుల ముందు కొనుక్కుని, సంక్రాంతికి విడుదల చేయాలంటే థియేటర్లు ఎలా దొరుకుతాయని ప్రశ్నించారు దిల్ రాజు. “సర్కార్”, “నవాబ్” లాంటి డబ్బింగ్ సినిమాలను కావాల్సినన్ని థియేటర్స్ లో ప్రదర్శించారని గుర్తుచేశారు దిల్ రాజు. “ఎఫ్2” ట్రైలర్ విడుదల కార్యక్రమంలో దిల్ రాజు ఈ విషయంపై మాట్లాడారు.

Related posts