telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

పల్నాడులో 144 సెక్షన్.. ధర్నాలకు అనుమతి లేదు: డీజీపీ

apcm jagan give full powers to gowtam as dgp

తమ కార్యకర్తలపై వైసీపీ శ్రేణులు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ టీడీపీ ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చింది. దీంతో పల్నాడు ప్రాంతం  రాజకీయ ప్రకంపనలతో అట్టుడుకుతోంది. వైసీపీ కూడా టీడీపీకీ కౌంటర్ ఇచ్చేందుకు సిద్దమవుతుంది. ఈ పరిస్థితులపై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉందని, 30 పోలీస్ యాక్ట్ కూడా విధించామని వెల్లడించారు. ఊరేగింపులు, ధర్నాలు, ప్రదర్శనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.

ప్రజలు వినాయక చవితి, మొహర్రం వంటి పండుగలను ప్రశాంతంగా జరుపుకుంటున్నారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని పేర్కొన్నారు. శాంతిభద్రతలు కాపాడడంలో రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలని డీజీపీ కోరారు. పల్నాడు ప్రాంతంలో అవాంఛనీయ ఘటనలు జరిగితే ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

Related posts