telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

విశాఖలో పులివెందుల పంచాయితీలు: దేవినేని ఉమా

devineni on power supply

విశాఖలో పులివెందుల పంచాయితీలు మొదలయ్యాయని మాజీ మంత్రి, టీడీపీ నేత దేవినేని ఉమా అన్నారు. విశాఖలో ఏడు నెలల్లో 36 వేల ఎకరాల లావాదేవీలు జరిగాయని తెలిపారు. వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఇన్సైడర్ ట్రేడింగ్ లో పాల్గొన్నారని ఆయన ఆరోపించారు. వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఇన్సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ విచారణకు ఆదేశించాలని సవాల్ విసిరారు

టైకూన్ రెస్టారెంట్ వద్ద 3.9 ఎకరాల క్రిస్టియన్ ప్రాపర్టీకి విజయ్ అనే వ్యక్తి అడ్వాన్స్ ఇచ్చిన మాట వాస్తవం కాదా? అని ఆయన ప్రశ్నించారు. . ఆడిటర్ జీడీ, కేవీఆర్, కృష్ణారెడ్డి, వెంకట్ రెడ్డి వీరంతా ఎవరని, వీరు కొన్న ఆస్తులేంటని ప్రశ్నించారు. నీళ్ల కుండీల జంక్షన్ వద్ద పద్మనాభం గుడికి వెళ్లే దారిలో 100 ఎకరాల లేఔట్ సంగతేమిటని నిలదీశారు. భీమిలి దగ్గర మూడెకరాల మీ నివాసం సంగతేంటని ప్రశ్నించారు. 35 మంది ఆర్మీ మాజీ అధికారుల నుంచి లాగేసుకున్న 175 ఎకరాల విషయం ఏమిటి? అని దేవినేని ప్రశ్నించారు.

Related posts