telugu navyamedia
రాజకీయ

తెలుగు రాష్ట్రాల్లో న్యూఇయర్ వేడుక‌లు కండీషన్స్ ఇవే..

మరికొద్ది గంటల్లో న్యూ ఇయర్ కు స్వాగ‌తం ప‌లికేందుకు ప్రపంచ మొత్తం సిద్ధమైంది. జోష్‌ కోసం ఎదురుచూస్తున్న యువతను.. పోలీసులు ఆంక్ష‌లు విధించారు. 

ఓమిక్రాన్ వ్యాప్తి చెందకుండా ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాలు కొత్త సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించగా.. పలు రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమలవుతుండగా, మరికొన్ని రాష్ట్రాలు నూతన సంవత్సర వేడుకలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.

అదే విధంగా తెలుగు రాష్ర్టాలైన ఏపీ తెలంగాణ‌లో కూడా అదే ప‌రిస్థితి..  ఓమిక్రాన్‌ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో రాష్ర్ట ప్ర‌భుత్వాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి.. నూతన సంవత్సర వేడుకలపై కఠిన ఆంక్షలు విధిస్తున్నారు..

తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం అర్ధరాత్రి వరకు ఆల్కహాల్‌కు అనుమతి ఇచ్చింది..అయితే ఫుల్‌ గా తాగి రోడ్డెక్కితే ..జైల్లో ఊస‌లు లెక్క‌పెట్ట‌డం త‌ప్ప‌దు అంటున్నారు . మద్యం సేవించి పట్టుబడితే 10 వేలు రూపాయలు ఫైన్ కట్టాల్సిందే. లేదంటే 6 నెలల జైలుశిక్ష ఉంటుంది. రెండోసారి పట్టుబడితే 15 వేల రూపాయల జరిమానా లేదంటే రెండేళ్ల పాటు జైలుశిక్ష అనుభవించాలి. ఏకంగా డ్రైవింగ్‌ లైసెన్స్ కూడా రద్దు చేస్తారు.  హైదరాబాద్  రేపు రాత్రి 11 నుంచి ఉదయం తెల్లవారే వరకు ఫ్లైఓవర్లపై రాకపోకలు బంద్.

Restrictions On New Year Celebrations In AP?? - Ap Cm Ys Jagan Curfew Omicron-TeluguStop

అలాగే ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనూ న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు అమల్లో ఉంటాయి. పర్యాటక కేంద్రమైన విశాఖలోనూ కఠిన ఆంక్షలు విధించారు పోలీసులు.. రాత్రి 8 గంటల నుంచి అన్ని బీచ్‌లు మూసివేయనున్నారు.. రాత్రి 8 గంటల నుంచి ఆర్కే బీచ్‌, జోడుగుళ్లపాలెం బీచ్‌, సాగర్‌నగర్‌ బీచ్‌, రుషికొండ బీచ్‌, భీమిలి బీచ్‌, యారాడ బీచ్‌లకు సందర్శకులకు, వాహనాల రాకపోకలకు అనుమతి లేదని స్పష్టం చేశారు పోలీసులు.. ఇ

రాత్రి 10 గంటల నుంచి శనివారం ఉదయం 5 గంటల వరకు ఎన్‌సీబీ (నేవల్‌ కోస్టల్‌ బ్యాటరీ) నుంచి భీమిలి వరకు బీచ్‌రోడ్డులో అన్ని వాహనాల రాకపోకలను నిషేధించారు. అత్యవసర వాహనాలు సర్వీసు రోడ్డు మీదుగా ప్రయాణించాలని ట్రాఫిక్ ఏడీసీపీ ఆదినారాయణ వెల్ల‌డించారు.

రెస్టారెంట్లు, బార్లు, హోటళ్లు, దుకాణాలు ప్రభుత్వ నిబంధనల మేరకు వారికి కేటాయించిన సమయం వరకే పరిమితం అవ్వాలని స్పష్టం చేశారు.. బహిరంగ ప్రదేశాలు, పార్కులు, రహదారులపై ఎలాంటి వేడుకలు జరపకూడదని.. ద్విచక్రవాహనదారులు అతివేగంగా వెళ్ళ‌కూడ‌దు… డీజేలు, సౌండ్ సిస్టంలకు అనుమతి లేదు…నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Related posts