telugu navyamedia
సినిమా వార్తలు

తాగుడుకు బానిసైన “హ్యారీ పోటర్”…

Daniel-Radcliff

“హ్యారీ పోటర్” సిరీస్ తో డేనియల్ రాడ్ క్లిఫ్ హాలీవుడ్ లో స్టార్ హీరోగా ఎదిగారు. ఈ చిత్రంతో ఒక్క హాలీవుడ్ లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు డేనియల్. ఇండియాలో కూడా డేనియల్ బాగా పాపులర్ అయ్యాడు. అయితే ఈ స్టార్ హీరో ఓ కార్యక్రమం సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. “హ్యారీ పోటర్” సిరీస్ నుండి తొలి చిత్రం విడుదలైనప్పుడు ఆనందాన్ని పట్టలేకపోయాడట. అంతేకాదు ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో బాగా తాగేశానని వెల్లడించాడు డేనియల్. ఈ సినిమా ద్వారా తనకు వచ్చిన భారీ గుర్తింపును తట్టుకోలేకపోయానని, దాన్ని మర్చిపోవడానికి విపరీతంగా తాగేవాడినని, అలా తాగడం వల్ల మందుకి బానిసయ్యాయని చెప్పుకొచ్చాడు డేనియల్. ఈ అలవాటు నుండి బయట పడడానికి చాలా కాలం పట్టిందని, “హ్యారీ పోటర్” సినిమాలో నటించకపోయుంటే బాగుండేదని అప్పుడప్పుడూ అనిపించేదని కూడా తెలిపాడు.

Related posts