telugu navyamedia
సినిమా వార్తలు

“మహానాయకుడు” రెండ్రోజుల కలెక్షన్స్

NTR-Mahanayakudu

వెండితెర ఇలవేల్పుగా తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకొన్న గొప్ప సినీ, రాజకీయ నాయకుడు దివంగత నందమూరి తారకరామారావు. ఆ మహనీయుడి జీవితం ఆధారంగా క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ ప్రధాన పాత్రలో ఎన్టీఆర్ బయోపిక్ తెరకెక్కింది. తొలిభాగమైన “ఎన్టీఆర్ కథానాయకుడు” జనవరి 9న భారీ హైప్ తో విడుదలై “కథానాయకుడు” చిత్రబృందాన్ని, ప్రేక్షకులను నిరాశపరిచింది. తాజాగా విడుదలైన రెండవ భాగమైన “ఎన్టీఆర్ మహానాయకుడు” కూడా పేక్షకులను పెద్దగా మెప్పించలేకపోయింది.

ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల ద్వారా ఈ సినిమా కేవలం లక్ష డాలర్లను మాత్రమే వసూలు చేసింది. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ.1.57కోట్ల షేర్ సాధించింది ఈ సినిమా. రెండో రోజు కలెక్షన్స్ మరింత డ్రాప్ అవ్వడంతో రూ.45 లక్షలు వసూలు చేసింది. నైజాంలో రూ.18 లక్షలు, ఉత్తరాంధ్రలో రూ.7 లక్షలు, గుంటూరులో రూ.5 లక్షలు, నెల్లూరులో రూ.2 లక్షల షేర్ తో సరిపెట్టుకుంది. రెండు రోజులకు కలిపి ఈ సినిమా వసూలు చేసిన మొత్తం రెండు కోట్లు. ఆశించిన స్థాయిలో చిత్రం లేకపోవడంతోనే ఇంత దారుణమైన కలెక్షన్లను సరిపొట్టుకోవాల్సి వచ్చింది ఈ చిత్రం.

Related posts