telugu navyamedia
crime news trending

తమిళనాడులో దోపిడీ.. హైదరాబాద్‌లో చిక్కిన దొంగలు

తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసును సైబరాబాద్ పోలీసులు ఛేదించారు. తమిళనాడులోని హోసూరులో ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ జరిగింది. ఈ కేసులో నలుగురు దోపిడీ దొంగలను అదుపులోకి తీసుకున్నారు సైబరాబాద్ పోలీసులు. తమిళనాడు నుంచి హైదరాబాద్, కర్ణాటక పారిపోయేందుకు ప్రయత్నించిన దోపిడీదారులు…. సైబరాబాద్ పోలీసులకు వచ్చిన సమాచారంతో దోపిడీ దొంగలను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఈ సందర్భంగా పెద్ద మొత్తంలో చోరీ చేసిన సొత్తును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. తమిళనాడు, తెలంగాణ మీదుగా కర్ణాటక పారిపోయేందుకు ప్రయత్నించారు ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ దొంగలు. కానీ పోలీసులు చాకచక్యంతో దొంగలను పట్టుకున్నారు. అయితే.. దోపిడీకి ముందు మేనేజర్, నలుగురు సిబ్బందిని తుపాకీలతో బెదిరించి బంగారు ఆభరణాలు, నగదుతో ఉడాయించారు దొంగలు. దాదాపు 24 కిలోలకుపైగా బంగారం, లాకర్లలో ఉన్న రూ.96వేల నగదు దోచుకెళ్లినట్లు ముత్తూట్‌ ఫైనాన్స్‌ సిబ్బంది పోలీసులకు కంప్లైంట్‌ చేశారు.

Related posts

మహిళలపై దర్శకుడి అనుచిత వ్యాఖ్యలు… చిన్మయి ఫైర్

vimala p

అమరావతి : … నవరత్నాల పై .. రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలు ..

vimala p

గూగుల్ కు రూ. 1400 కోట్ల జరిమానా… ఎందుకంటే ?

vimala p