telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

బాలయ్య వారసుడి ఎంట్రీ డేట్‌ ఫిక్స్‌ !

నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వర్కింగ్ టైటిల్ “బిబి-3” పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇటీవల విడుదలైన బీబీ 3 టీజర్ ‌కి మాస్ ఆడియన్స్‌లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. అయితే.. బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీపై క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది. హీరోగా ఎంట్రీ జూన్‌లో ఉండబోతోందని తెలుస్తోంది. బాలయ్య పుట్టిన రోజైన 10న మోక్షజ్ఞ సినిమాని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారని టాలీవుడ్‌లో టాక్‌ నడుస్తోంది. అయితే.. ఈ సినిమాను ఎవరు డైరెక్ట్‌ చేస్తారనేది కూడా మొన్నటి వరకు పెద్ద క్వశ్చన్‌ మార్క్‌గా ఉండేది. అయితే.. దీనిపై కూడా క్లారిటీ వచ్చినట్టు కనిపిస్తుంది. మోక్షజ్ఞ మొదటి సినిమాను పూరీ జగన్నాథ్‌ డైరెక్షన్‌ చేస్తారట. మోక్షజ్ఞ కోసం పూరీ ఓ స్టోరీ రెడీ చేశాడని.. అంతేకాదు.. ఇప్పటికే బాలయ్య కూడా ఆ స్టోరీని వినిపించాడట పూరీ. ఆ కథకు బాలయ్య బాబు కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు కనిపిస్తోంది. మోక్షజ్ఞ మొదటి సినిమానే పాన్‌ ఇండియా లెవల్‌లో ఉండనుందట. 

Related posts