telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తెలుగు రాష్ట్రాల ప్రజలు మాట్లాడుకోలేని పరిస్థితి: చంద్రబాబు

chandrababu meeting on voting and success

ఐదేళ్లలో ఏపీకి మోదీ ఏం చేయలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ హామీలు అమలు చేయాలని అడిగినందుకు దాడులు చేశారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా పదేళ్ళు కావాలని ఆనాడు బీజేపీనే అడిగిందని చంద్రబాబు గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు మాట్లాడుకోలేని పరిస్థితి తెచ్చింది మోదీనే అని ఆయన అన్నారు.
తెలంగాణకు రాజధాని ఉందని, 60 ఏళ్ళ కష్టార్జితాన్ని వదులుకుని వచ్చామని చంద్రబాబు అన్నారు.

ఉత్తరాఖండ్‌, ఉత్తరాంచల్‌, ఛత్తీస్‌గఢ్‌ విడిపోయాక వాటికి కేంద్రం ప్రత్యేక రాయితీలు ఇచ్చిందని చంద్రబాబు అన్నారు. ప్రధాని మోదీకి ప్రాథమిక విషయాలు కూడా తెలియవని విమర్శించారు. డబ్బు, కులం చూసి ఓటేస్తే, రాజకీయ నేతలు ఎందుకు పనిచేయాలని అన్నారు. తెలంగాణ కంటే ఎక్కువ అభివృద్ధి చేశామని చెప్పారు. వైసీపీ మైండ్‌గేమ్‌ ఆడుతోందని, ఎన్నికల్లో సైలెంట్‌ ఓటు తమకే అనుకూలమని అన్నారు. తాను ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు టీడీపీ విజయానికి కీలకం కానున్నాయని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.

Related posts