telugu navyamedia
news political Telangana

తెలంగాణ వచ్చిన సంతోషం కొందరిలోనే ఉంది: కోమటిరెడ్డి

komati-venkat-reddy mp

తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంతోషం కొందరిలోనే ఉందని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రంలో కరోనా వచ్చినా, తుఫాన్ వచ్చినా రైతులను ఆదుకునే వారే లేరని దుయ్యబట్టారు. గుండాలకు రావాల్సిన నీటిని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అక్రమంగా పాలకుర్తికి తరలిస్తున్నారని అన్నారు. ఎర్రబెల్లి మంత్రి కావడం మన దురదృష్టమని ఆయన చెప్పారు.

ఆలేరు నియోజకవర్గానికి సాగునీరు ఇస్తానని సీఎం కేసీఆర్‌ మాట తప్పారని దుయ్యబట్టారు. గందమళ్ల రిజర్వాయర్ రద్దైనట్లేనని అధికారులు చెప్పారని, బస్వాపూర్ నుంచి గుండాల మండలానికి నీళ్లు రావని తెలిపారు. ఏడాది లోగా బస్వాపూర్‌ నుంచి ఆలేరుకు నీళ్లు తీసుకొస్తే.. కేసీఆర్‌ ఫొటోకు పాలాభిషేకం చేస్తామని అన్నారు.

Related posts

నిరాడంబరంగా శ్రీరామనవమి వేడుకలు

vimala p

సాఫ్ట్ వేర్ .. ఈ ఏడాదిలో లక్ష ఉద్యోగాలు… : టీసీఎస్ గ్లోబల్ హెడ్ రాజన్న.వి

vimala p

రూ.2 వేల నోట్లు ఎక్కువే ఉన్నాయి!

vimala p