నాగరికతలో బ్రతుకుతున్న మనం.
పాతాళానికి పయనమవుతున్నాము..
ప్రేమ మమకారాలు మాయంకాగా.
అంతర్జాల అనుబంధాల నడుమ ఆవిరైపోతున్న బంధాలు ఎన్నో..
దూరమున్న వాళ్లని దగ్గర చేస్తూ.
దగ్గర ఉన్న వాళ్లను దూరం చేస్తూ..
అరచేతిలో ఇమిడిపోయే చరవాణి స్నేహంతో
ఆడుకుంటుంది అంతర్జాలం.
గాలిలో పయనించే చిత్రాలు.! మేఘాలలో మోసుకొచ్చే సందేశాలు..
మాయాలోకం పోకడలతో ముందుకెళ్తుంది అంతర్జాలం..
ఇదో మాయమంత్రాల నిలయం..
-దూడపాక శ్రీధర్, మంథని