telugu navyamedia
సినిమా వార్తలు

పచ్చని చెట్లు…

bratuku gosa poetry corner
జగతిప్రగతికి మెట్టు
నీవు నాటే చెట్టు
పుడమి తల్లికి బొట్టు
ఓ వెన్నెలమ్మ!
విశ్వ మనుగడ తరువు
ప్రాణ శ్వాసకు నెలవు
మనిషి వృద్ధికి తెరువు
ఓ వెన్నెలమ్మ!
సకల జీవుల గూడు
మనిషి బ్రతుకున తోడు
చెట్లు నరికిన కీడు
ఓ వెన్నెలమ్మ!
చెట్లు విరివిగ నాటు
పచ్చదనమును చాటు
తప్పునప్పుడు చేటు
ఓ వెన్నెలమ్మ!
-గద్వాల సోమన్న, ఎమ్మిగనూరు

Related posts