telugu navyamedia
సినిమా వార్తలు

పెద్ద హీరోపై.. పెండింగ్ లో ఉన్న చలానాలు…చెల్లించలేరా…

challan pending on big heros in tollywood

ఎందరో అభిమానులను సంపాదించుకున్న అగ్రనటులు కూడా చిన్న చిన్న విషయాలలో సామాన్యుల మాదిరి ప్రవర్తిస్తున్నారు. ఏళ్ళ తరబడి తమ పేరుమీద ఉన్న చలనాలను అలాగే పేరబెట్టుకున్నారు. సినిమాలలో నీతులు చెబుతూ ఉండే హీరోలు నిజ జీవితంలో వచ్చేసరికి తేలిపోయేపనులు చేస్తున్నారు. ట్రాఫిక్‌ రూల్స్‌ను ఉల్లంఘించి వారు చెల్లించాల్సిన చలాన్లు గత రెండు మూడేళ్లుగా మరుగునపడుతున్నా.. వాటిని మాత్రం చెల్లించలేకపోతున్నారు. నందమూరి బాలకృష్ణ, సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు, పవన్‌ కళ్యాణ్‌లాంటి స్టార్‌ హీరోలు ప్రయాణించిన వాహనాలు ఓవర్‌స్పీడ్‌, పార్కింగ్‌ నిబంధనలు ఉల్లఘించి ట్రాఫిక్‌ కెమెరాకు చిక్కాయి. దీంతో వీరి ఖాతాల్లో చలాన్లు పేరుకుపోయాయి.

ఈ జాబితాలో అత్యధికంగా మహేష్‌ బాబు పేరిట ఏడు సార్లు నిబంధనలు ఉల్లంఘించినందుకు గాను రూ.8,745 పెండింగ్‌లో ఉన్నాయి. వీటిని 2016 నుంచి మహేష్‌ కట్టలేకపోతున్నారు. 2018లో నందమూరి బాలకృష్ణ ప్రయాణిస్తున్న కారు రాజేంద్రనగర్‌ వద్ద అతివేగంతో పయనించడంతో రూ.1035 ఫైన్‌ వేశారు. పవన్‌ కళ్యాణ్‌ వాహనం పార్కింగ్‌ నిబంధనలను ఉల్లంఘించినందుకు గానూ మూడు చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2016 నుంచి ఆయన ఈ రూ.505 ఫైన్‌ను చెల్లించలేకపోతున్నారు. సునీల్‌, నితిన్‌ లాంటి హీరోల చలాన్లు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. పది చలాన్లు మించి పెండింగ్‌లో ఉన్నవారి వాహనాలను సీజ్‌ చేస్తామంటూ హైదరాబాద్‌ అదనపు ట్రాఫిక్‌ కమిషనర్‌ అనిల్‌ కుమార్‌ తెలిపారు. మరి అది ఈ ప్రముఖుల విషయంలో పాటిస్తారా లేదా అనేది చూడాల్సి ఉంది.

Related posts