telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

లాభాల బాట పట్టిన సోలో బ్రతుకే సో బెటర్…

Sai Dharam tej

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ లో మూత బడిన థియేటర్లు ఇటీవల తెరుచుకున్న సంగతి తెలిసిందే. కానీ థియేటర్లలో సినిమాలు విడుదల చేయడానికి దర్శకనిర్మాతలందూ వెనకడుగు వేస్తున్నారు. అదే సయంలో సోలోగా ముందడుగు వేశాడు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ తన నూతన సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసి అందరికీ షాక్ ఇచ్చాడు. సోలోగా వెళ్లాడు తిరిగి వస్తాడా..రాడా అని సినీ పరిశ్రమ బిక్కుబిక్కుమంటూ చూస్తుండగా కుంభస్థలాన్ని బద్దలు కొట్టుకొచ్చాడు. లాక్‌డౌన్ తరువాత థియేటర్లలో విడుదలైన మొట్టమొదటి బడ్జెట్ సినిమాగా సోలో బ్రతుకే సో బెటర్ ప్రత్యేక స్థానంలో నిల్చుంది. అంతేకాకుండా బాక్స్‌ ఆఫీస్‌ను బద్దలు కొట్టింది. భారీ కలెక్షన్లను రాబట్టి అందరి సందేహాలకు సమాధానంగా నిల్చుంది. ఈ సినిమా జనవరీ1 నుంచి లాభాల బాటలో అత్యంత వేగంగా వెళుతోంది. ఈ సినిమా విడుదలైన తొలి వారానికే పెట్టుబడిని సంపాదించింది. ఈ నెల 1నుంచి లాభాల వేటలో పడింది. గత సంవత్సరం ఎలా ఉన్నా ఈ ఏడాది మాత్రం సినీ పరిశ్రమకు గొప్ప ఆరంభాన్ని ఇచ్చింది. చూడాలి మరి సంక్రాంతికి వచ్చే సినిమాలు ఏం చేస్తాయి అనేది.

Related posts