telugu navyamedia
సినిమా వార్తలు

ఆ దర్శకుడు నన్ను 30 సార్లు చెంప దెబ్బ కొట్టాడు… తైవాన్ బ్యూటీ కామెంట్స్

Cannes film exposes actress abuse

కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో 36 ఏళ్ళ తైవాన్ నటి వు కె ఝి రచించి, నటించిన “నినా వు” సినిమా ప్రదర్శితమైంది. ఈ సందర్భంగా ఫెస్టివల్‌కు హాజరైన నటి ఝి మాట్లాడుతూ ఒకప్పుడు తనపై జరిగిన దాడి గురించి చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది. ఓ యాడ్ షూట్‌లో జరిగిన భయంకరమైన ఘటనను తానెప్పటికీ మర్చిపోలేనని తెలిపింది. యాడ్ షూటింగ్ సందర్భంగా అది క్లోజప్ షాటా? లేక లాంగ్ షాటా? అని డైరెక్టర్‌ను అడిగానని, అందుకు అనుగుణంగా సిద్ధమవాలనే అలా ప్రశ్నించానని, కానీ తన ప్రశ్న వినగానే డైరెక్టర్ ఆగ్రహంతో తన చెంపను చెడామడా వాయించాడని, దాదాపు 30 సార్లు అతడి చేయి తన చెంపను బలంగా తాకిందని, ఆ తర్వాత ఆ షాట్‌ను క్లోజప్‌లోనే చిత్రీకరించారని, డైరెక్టర్ తనపై చేయి చేసుకోవడంతో అందరూ నిర్ఘాంతపోయారని పేర్కొంది. కేవలం ప్రశ్నించిన పాపానికి తీవ్ర శిక్షను ఎదుర్కోవాల్సి వచ్చిందని వాపోయిన ఈ బ్యూటీ ఈ విషయాన్నీ ఏకంగా కేన్స్ లో బయటపెట్టడంతో హాట్ టాపిక్ గా మారింది.

Related posts