telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్

ప్రియురాలి కోసం .. ఏకంగా విమానం హైజాక్ .. జీవిత ఖైదుతో కథ ముగింపు..

businessman high drama for lover got life prison

ఏన్ఐఏ కోర్టు, ప్రియురాలు కోసం ఫ్లైట్‌ హైజాక్ డ్రామా ఆడిన ఓ వ్యాపారవేత్తకు కఠినమైన శిక్ష ను విధిస్తు తీర్పును వెలువరించింది. విమానం హైజాక్ అయిందంటూ ఫేక్ లేటర్ రాసిన వ్యక్తికి 5కోట్ల జరిమానతో పాటు జీవిత ఖైదును విధించింది. జరిమానాను ఫ్లైట్‌ ప్రయాణికులతో పాటు విమాన సిబ్బందికి పంచాలని ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. అక్టోబర్,30 2017లో జెట్ ఎయిర్‌ వేస్‌కు చెందిన ముంబాయి-ఢిల్లీ ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న ముంబాయి బిర్జు సల్లా అనే వ్యాపారవేత్త బిజినెస్ క్లాస్‌లో ప్రయాణించాడు. అయితే బిర్జు సల్లా ప్రయాణిస్తున్న విమానంలోనే బిజినెస్ క్లాస్‌లోని టాయిలెట్‌లో ఉన్న టిష్యు పేపర్స్‌పైన విమానాన్ని” పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోకి” తీసుకెళ్లాలంటూ రాసి అల్లా చాల గొప్పవాడని ఇంగ్లీష్‌తో పాటు ఉర్ధూ బాషలో రాసి పెట్టాడు. దీనితో భయాందోళనలకు గురైన విమాన సిబ్బంది విమానం హైజాక్ అయినట్టు ఆందోళన చెందారు. అనంతరం విమానాన్ని వెంటనే అహ్మాదాబాద్ ఎయిర్ పోర్టులో అత్యవసరంగా దింపారు.

దీనిపై పోలీసులు విచారణ చెపట్టారు. ఇంతా చేసింది బిర్థు సల్లా అనే వ్యక్తిగా గుర్తించారు. ఆయనపై పాత చట్టాల ప్రకారం కాకుండా విమాన హైజాక్‌లో తీసుకు వచ్చి కోత్త చట్టాల ప్రకారం కేసును నమోదు చేశారు. ఆ చట్టాల ప్రకారం కేసు పెట్టిన మొట్ట మొదటి వ్యక్తి సల్లానే కావడం గమనార్హాం. సల్లా విమానంలో ప్రయాణించడంపై కూడ నిషేధం విధించారు. అనంతరం కేసును విచారించిన ఏన్ఐఏ కోద్ది రోజుల క్రితం ప్రత్యేక కోర్టుకు చార్జీ షీట్‌ను ధాఖలు చేసింది. కేసును విచారించిన అహ్మదాబాద్ ఎన్ఐఏ ప్రత్యేక సల్లాకు జీవితఖైదును విధించింది. జీవిత ఖైదుతోపాటు 5 కోట్ల రుపాయల జరిమానను కూడ విధించింది. విధించిన జరిమాన డబ్బులను ఆ సమయంలో విమానంలో ఉన్న ప్రయాణికులతోపాటు, విమాన సిబ్బందికి ఇవ్వాలని తీర్పులో పేర్కోంది.

సల్లా పోలీసుల విచారణలో చెప్పిన విషయాలు షాకింగ్‌గా ఉన్నాయి. ముంబాయికి చెందిన ప్రియురాలు జెట్ ఎయిర్ వేస్‌లోనే ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. ఆమేను ముంబాయికి రప్పించడంతో ఢిల్లీ కేంద్రంగా కొనసాగుతున్న జెట్ ఎయిర్ వేస్ సంస్థను క్లోజ్ చేస్తుందనే ఆలోచనతో తాను ఇలా చేసినట్టు ఓప్పుకున్నారని.. పోలీసులు వెల్లడించారు.

Related posts