telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు

బడ్జెట్ దెబ్బ : .. వచ్చేవారం కూడా .. మార్కెట్లపై.. ఇప్పటికే 2.22 లక్షల కోట్లు ఆవిరి..

husge loses again in stock markets

మార్కెట్ అంచనా నిపుణులు దేశీయ స్టాక్‌ మార్కెట్లలో వచ్చే వారం మదుపర్లు అప్రమత్తత పాటించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొంటున్నా రు. జులై 9తో ప్రారంభ మయ్యే వారంలో మార్కెట్ల ను ప్రధానంగా బడ్జెట్‌లో తీసుకున్న నిర్ణయాలు ప్రభావితం చేయనున్నాయని విశ్లేషిస్తున్నారు. స్టాక్‌ మార్కెట్లో లిస్టైన కంపెనీల్లో ప్రజల కనీస వాటాను 25 శాతం నుంచి 35 శాతానికి పెంచాలన్న ప్రతిపాదన మార్కెట్‌లపై ప్రతికూల ప్రభావం చూపనుందని అంచనా వేస్తున్నారు.

బైబ్యాక్‌ షేర్లపై డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ ట్యాక్స్‌(డిడిటి)ను విధింపు రూ.2 కోట్ల నుంచి రూ.5 కోట్లు, రూ.5 కోట్లకు మించిన పన్ను ఆదాయం గల సంపన్నులపై సర్‌చార్జీని పెంచాలన్న ప్రతిపాదన, భారీ డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యం, పెట్రోల్‌, లోహాలపై ఎక్సైజ్‌ సుంకం తదితర అంశాలు మార్కెట్లను ఒత్తిడికి గురి చేసే అవకాశం ఉంది. సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌ మార్కెట్లను మురిపించలేకపోవడంతో శుక్రవారం ఒకే రోజు మదుపర్ల రూ.2.22 లక్షల కోట్లు నష్టపోయిన విషయం తెలిసిందే.

Related posts