telugu navyamedia
రాజకీయ వార్తలు

కర్నాటక బీజేపీ ఎమ్మెల్యే శ్రీరాములుకు బంపర్ ఆఫర్

dk shivakumar

కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్షపై చర్చ కొనసాగుతోంది. గురువారం ఉదయం విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాక అటు కుమారస్వామి, ఇటు సిద్ధరామయ్య ఇద్దరూ బీజేపీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు.రెబల్స్ వెనుక బీజేపీ హస్తం ఉందంటూ ఆరోపించారు. విశ్వాస పరీక్ష ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని బీజేపీ నేత యడ్యూరప్ప పట్టుపట్టారు. అయితే మధ్యాహ్నం తర్వాత పరిణామాలు మారిపోయాయి. విశ్వాస పరీక్షను వాయిదా వేసేలా కాంగ్రెస్ వ్యూహ రచన చేస్తోంది.

బలపరీక్షను వాయిదా వేసి తిరిగి సుప్రీం కోర్టుకు వెళ్లాలంటూ స్పీకర్ రమేష్‌కు సిద్ధరామయ్య సూచించినట్లు సమాచారం. ఈ సందర్భంగా జేపీ ఎమ్మెల్యే బి. శ్రీరాములుకు కాంగ్రెస్ మంత్రి డికె శివకుమార్ ఓ ప్రతిపాదన పెట్టారు. తమ పక్షాన ఉంటే డిప్యూటీ సీఎం పదవి ఇస్తామంటూ ఆఫర్ ఇచ్చారు. అసెంబ్లీలో శ్రీరాములు వైపు చూస్తూ సీఎం కుమారస్వామి, డిప్యూటీ సీఎం పరమేశ్వర, మంత్రి శివకుమార్ చేతులు ఊపారు. ఆ తర్వాత కొద్దిసేపటికి శివకుమార్ శ్రీరాములుతో చర్చినట్టు సమాచారం.

Related posts