telugu navyamedia
రాజకీయ వార్తలు

మహారాష్ట్ర సీఎం పదవి శివసేనదే : సంజయ్‌ రౌత్‌

sanjay rout on alliance with bjp

మహారాష్ట్ర సీఎం పదవి శివసేనదే అని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు, రాజ్యసభ సభ్యులు సంజయ్‌ రౌత్‌ తేల్చిచెప్పారు. ఈ రోజు ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటు చేయకుండా బీజేపీ వెనక్కి తగ్గడమంటే మహారాష్ట్ర ప్రజలను అవమానపరచడమే అనియన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రతిపక్షంలో కూర్చునేందుకు సిద్ధపడింది. ఎన్నికల ముందు 50-50 ఫార్ములాకు అంగీకరించిన బీజేపీ.. ఫలితాలు వచ్చిన తర్వాత వెనక్కి తగ్గారు. 50-50 ఫార్ములాను అనుసరిస్తే నష్టమేంటి? అని బీజేపీ నాయకులను సంజయ్‌ రౌత్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌, ఎన్సీపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నామని సంజయ్‌ చెప్పారు.

ప్రభుత్వ ఏర్పాటు చేయాలని గవర్నర్ తమకు తక్కువ సమయం ఇచ్చారు. ఇదంతా బీజేపీ ప్రణాళిక.. రాష్ర్టపతి పాలన విధించేందుకు బీజేపీ పావులు కదుపుతుందని సంజయ్ రౌత్ చెప్పారు. ఇక ఇవాళ సాయంత్రం 7:30 గంటల్లోపు ప్రభుత్వ ఏర్పాటు విషయాన్ని చెప్పాలని శివసేనకు ఆ రాష్ట్ర గవర్నర్‌ డెడ్‌లైన్‌ విధించిన సంగతి తెలిసిందే. 288 సీట్లున్న మహారాష్ట్ర అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో బీజేపీ-105, శివసేన-56, ఎన్సీపీ-54, కాంగ్రెస్-44 స్థానాల్లో గెలుపొందాయి.

Related posts