telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

పోస్టల్ లెక్కింపుతో .. మొదలు.. బైంసా బీజేపీ హావ..

5000rs demand for postal ballet

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్‌, కార్పొరేషన్‌ ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియ ప్రారంభమైంది. ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం కాసేపట్లో తేలనుంది. ఈనెల 22న రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లకు ఎన్నికల జరిగిన విషయం తెలిసిందే. కౌంటింగ్‌ ప్రక్రియ శనివారం ఉదయం 8 గంటలకు మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 2619 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఓట్ల సంఖ్యను బట్టి 5 నుంచి 24 రౌండ్లలో కౌంటింగ్‌ చేపట్టనున్నారు. మొదట పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు, అనంతరం బ్యాలెట్‌ పత్రాల ఓట్లను లెక్కించనున్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు. పదింటికల్లా తొలి ఫలితం వెలువడనుంది. ఒకవేళ ఓట్లు సమానంగా వస్తే లాటరీ ద్వారా అభ్యర్థి విజయాన్ని నిర్ణయిస్తారు. ఈ నేపథ్యంలో ఫలితాలపై రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ కనిపిస్తోంది. ఈనెల 27న జరగనున్న మున్సిపల్‌ చైర్మన్లు, కార్పొరేషన్‌ మేయర్ల ఎన్నిక జరగనుంది.

మొదట పోస్టల్ బ్యాలెట్‌ను అధికారులు లెక్కిస్తున్నారు. నిర్మల్ జిల్లా బైంసా మున్సిపాలిటీలో మొత్తం 14 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదు కాగా వాటిలో ఒకటి చెల్లుబాటు కాలేదు. చెల్లుబాటైన 13 పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ఎంఐఎంకి 3, బీజేపీకి 8, స్వతంత్ర అభ్యర్థికి 1 చొప్పున పోలయ్యాయి.

Related posts