telugu navyamedia
andhra news political telugu cinema news trending

జూ.ఎన్టీఆర్ అవసరం .. పార్టీకి లేదు .. : బాలకృష్ణ చిన్నల్లుడు భరత్

balakrishna son-in-law on junior ntr into tdp

నందమూరి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్ టీడీపీ పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. ఓ మీడియా చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భరత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్టీలో ఇప్పుడున్న నాయకులు సమర్థులేనని, వారితో పార్టీ పటిష్ఠంగానే ఉందని భావిస్తున్నామని స్పష్టం చేశారు. ఎన్టీఆర్ వస్తేనే పార్టీ బలోపేతం అవుతుందన్న వాదనతో తాను ఏకీభవించనని అన్నారు. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ మనవడిగా, ఛరిష్మా ఉన్న నటుడుగా జూనియర్ ఎన్టీఆర్ ను కలుపుకుని పోవాల్సిన బాధ్యత పార్టీపై ఉంది కదా! అని మీడియా ప్రతినిధి ప్రశ్నించగా, జూనియర్ ఎన్టీఆర్ కు రాజకీయాల్లో ఆసక్తి ఉంటే ఆ విషయం తమ పార్టీ అధినేతకు తెలియజేయాలని, ఆపై వారిద్దరూ చర్చించుకుని ఓ నిర్ణయం తీసుకుంటారని భరత్ వివరించారు.

ఇప్పటి టీడీపీ యువ నాయకత్వం కొత్త ఆలోచనలతో ముందుకెళ్లగలిగితే పార్టీని తామే బలోపేతం చేసుకోగలమని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. ఆనాడు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఆయన వెంట సామాన్యులే ఉన్నారని, వారందరూ జూనియర్ ఎన్టీఆర్లు కాదు కదా అంటూ భరత్ తన అభిప్రాయాలు పంచుకున్నారు.

Related posts

కశ్మీర్ టూర్‌ ను బహిష్కరించిన ట్రావెల్ ఏజెంట్లు

ashok

నేడు మున్సిపల్ ఓటరు జాబితా విడుదల

vimala p

నిఖిల్  హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో ‘కార్తికేయ – 2 ‘

ashok