తాలిబన్ల అధికార ప్రతినిధి, ఆఫ్గానిస్థాన్ నుంచి అమెరికా సైనికులను ఉపసంహరించుకొనే అంశంపై విభేదాలన్నీ పరిష్కారమయ్యాయని వెల్లడించారు. అతివాద ముఠాలతో సంబంధాలు ఉండకూడదన్న అమెరికా షరతును తాము అంగీకరించామని తెలిపారు. తాలిబన్లు, అమెరికా ప్రతినిధుల మధ్య ఖతార్‌లోని దోహాలో మంగళవారం కూడా చర్చలు కొనసాగాయి.
శాంతి ఒప్పందం చివరి దశకు వచ్చిందని, సైనికుల ఉపసంహరణకు అమెరికా అంగీకరించిందని, వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తాలిబన్ ప్రతినిధి పేర్కొన్నారు.