telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఒకసారి మసక్కలి ఒరిజినల్‌ పాటను విని సంతోషించండి : ఏఆర్‌ రెహమాన్‌

ar-rahman

సిద్దార్థ్‌ మల్హోత్రా, తారా సుతారియా నటించిన మసక్కలి 2.0 హిందీ పాట ఇటీవల విడుదలైంది. కొత్త వర్షన్‌ మసక్కలి పాటను తనీష్‌ బాగ్చి రూపొందించారు. ఈ పాట​కు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. తాజాగా ఈ మసక్కలి 2.0 పాటపై ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్‌ రెహమాన్‌ ట్విటర్‌లో స్పందించారు. ‘ఒక పాటను రూపొందించడానికి నిద్రలేని రాత్రులను గడపాల్సి వస్తుంది. పలుమార్లు మార్చి మార్చి పాటను రూపొందించాల్సి ఉంటుంది. ఒరిజినల్‌ మసక్కలి పాట కోసం సుమారు 200 మంది సంగీతకారులు పనిచేశారు. అందుకే ఒకసారి మసక్కలి ఒరిజినల్‌ పాటను విని సంతోషించండి’ అని రెహమన్‌ పేర్కొన్నారు. అంతేకాకుండా మసక్కలి ఒరిజనల్‌ పాట లింక్‌ను కూడా షేర్‌ చేశాడు. కాగా ఈ పాటను ఏఆర్‌ రెహమన్‌ ‘ఢిల్లీ 6’ మూవీ కోసం కంపోజ్‌ చేసిన విషయం తెలిసిందే. అప్పట్లో ఈ పాట పెద్ద మ్యూజికల్‌ హిట్‌గా నిలిచింది.

Related posts