telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నాకు నచ్చినప్పుడే ఎక్స్‌పోజ్ చేస్తాను… ఫ్యాన్స్ కు స్టార్ హీరోయిన్ కౌంటర్

Gigi

ప్రముఖ అమెరికన్ మోడల్ గిగి హ్యాడిడ్‌కి యువతలో చాలా క్రేజ్ ఉంది. అయితే ఒక్కోసారి గిగి బయటికి వెళ్లేటప్పుడు ఎక్కడా ఎక్స్‌పోజింగ్ లేకుండా నిండుగా ఉండే దుస్తులు వేసుకుని బయటికి వస్తుంటారు. కేవలం ఫ్యాషన్ షోలు, ప్రకటనలు, సినిమాల్లో మాత్రమే కాస్త ఎక్స్‌పోజింగ్ చేస్తుంటారు. అయితే బయటికి వచ్చేటప్పుడు సెక్సీ డ్రెసెస్ వేసుకోవడంలేదని నెటిజన్లు, ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. దీంతో ఫ్యాన్స్‌ని ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. “కొన్నిసార్లు మీరు మౌనంగా ఉంటే మంచిది. బయటికి వెళ్లేటప్పుడు నాకు నచ్చిన దుస్తులు వేసుకుంటాను. అంతేకానీ మీకోసం విప్పుకుని తిరగలేను. మీకు నచ్చిన డ్రెస్సులు వేసుకోలేను. నా స్టైల్ గురించి, నేను సెక్సీగా లేకపోవడం గురించి మీరు మాటిమాటికీ చేసే కంప్లైంట్స్ నా డ్రెస్సింగ్ స్టైల్‌ను మార్చవు. మీరంతా మహిళా సాధికారత గురించి చాలా గొప్పగా మాట్లాడుతుంటారు. ఎక్స్‌పోజ్ చేసేవారికి నేను మద్దతు తెలుపుతాను. అదే విధంగా చేయని వారికి కూడా సపోర్ట్ చేస్తాను. ఎవరి ఇష్టం వారిది. నాకు నచ్చినప్పుడు నేను ఎక్స్‌పోజ్ చేస్తాను. ఒంటినిండా దుస్తులు ఉన్నా కూడా నాకు నేను సెక్సీగా కనిపిస్తాను. నేనేదన్నా వేసుకున్నానంటే దానికి ఒక కారణం ఉంటుంది. ఎప్పుడూ స్టైల్‌గా ఉండాలంటే కుదరదు. మీ కామెంట్స్ నా ఆలోచనలు మార్చవు. మీకు ఎవరి స్టైల్ నచ్చుతుందే వారినే పొగడండి. ప్రశాంతంగా ఉండండి” అని పేర్కొన్నారు.

Related posts