telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్

తలనొప్పి .. చిటికెలో పోవాలంటే.. ఇలా .. !

tips to overcome headache issues

ఒత్తిడి తో కూడిన జీవనవిధానంలో ఉన్న‌ప్పుడు త‌ల‌నొప్పి వ‌స్తుండ‌డం స‌హ‌జం. అలాగే ప‌లు ఇత‌ర సంద‌ర్భాల్లోనూ మ‌న‌కు త‌ల‌నొప్పి వ‌స్తుంటుంది. ఇక వేస‌విలోనైతే ఎండలో కొంత సేపు తిరిగితే త‌ల‌నొప్పి ఖచ్చితంగా వ‌స్తుంది. ఎలాంటి త‌ల‌నొప్పి వ‌చ్చినా స‌రే.. ఏ ప‌నీ చేయ‌బుద్ది కాదు. త‌ల‌నొప్పికి త‌ల ప‌గిలిపోతుందేమోన‌ని అనిపిస్తుంది. దీని నుండి బయటపడేందుకు ప‌లు చిట్కాల‌ను ఉన్నాయి. వాటిని పాటిస్తే ఎలాంటి త‌ల‌నొప్పినైనా ఇట్టే త‌గ్గించుకోవ‌చ్చు. మ‌రి ఆ చిట్కాలు ఏమిటో తెలుసుకుందాం..!

* ఎండ‌లో తిర‌గాల్సి వ‌స్తే త‌ల‌కు టోపీ లాంటివి పెట్టుకోవాలి. లేదా స్కార్ఫ్ లాంటివి కూడా చుట్టుకోవ‌చ్చు. వీటి వ‌ల్ల ఎండ నేరుగా మ‌న త‌ల‌కు త‌గ‌ల‌కుండా ఉంటుంది.

tips to overcome headache issues* ఎండ‌లో తిర‌గ‌డం వ‌ల్ల వ‌చ్చిన త‌ల‌నొప్పి అయితే కొంత సేపు చ‌ల్ల‌ని నీడ‌లో ఉంటే ఇట్టే త‌గ్గిపోతుంది. చ‌ల్ల‌ని ప్ర‌దేశంలో ఉండి ముఖాన్ని చ‌ల్ల‌ని నీటితో క‌డుక్కోవాలి. క‌ళ్ల‌ను బాగా క‌డ‌గాలి. దీని వ‌ల్ల మ‌న‌స్సుకు ప్ర‌శాంత‌త క‌లుగుతుంది. రిలాక్స్ అయిన భావ‌న క‌లిగి త‌ల‌నొప్పి త‌గ్గుతుంది.

* నీటిని త‌గినంత తాగ‌క‌పోయినా త‌ల‌నొప్పి వ‌స్తుంటుంది. క‌నుక నిత్యం త‌గు మోతాదులో నీటిని తాగితే త‌ల‌నొప్పి రాకుండా చూసుకోవ‌చ్చు.

* చ‌ల్ల‌ని కొబ్బ‌రినీళ్లు, మ‌జ్జ‌గ‌, ఇత‌ర స‌హ‌జ సిద్ధ పానీయాల‌ను తాగితే త‌ల‌నొప్పి ఇట్టే ఎగిరిపోతుంది. ‘వ‌ట్టి’ వేరుతో చ‌ల్ల‌ని పానీయం త‌యారు చేసుకుని తాగితే త‌ల‌నొప్పి త‌గ్గుతుంది.

* అర‌టి పండ్లు, పైనాపిల్‌, పుచ్చ‌కాయ‌ల‌ను తిన‌డం వ‌ల్ల కూడా త‌లనొప్పిని త‌గ్గించుకోవ‌చ్చు.

Related posts