telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఎలక్ట్రిక్ బస్సులకు ఏపీఎస్ఆర్టీసీ టెండర్లు

apsrtc charges increased shortly

ఎలక్ట్రిక్ బస్సులను అద్దె ప్రాతిపదికన తీసుకునేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ ఆర్టీసీ) టెండర్లు ఆహ్వానించింది. ఈ పద్ధతిలో 350 ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ అద్దెకు తీసుకోనుంది. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిన టెండర్లు ఆహ్వానించింది. ఈ సందర్భంగా ప్రీబిడ్ సమావేశం నిర్వహించింది.

రన్నింగ్ కిలో మీటర్ల ప్రాతిపదికన చెల్లింపులు చేసేలా పన్నెండేళ్ల కాలపరిమితికి ఈ టెండర్లు వర్తిస్తాయి. ఎలక్ట్రిక్ బస్సులపై అక్టోబర్ 14లోగా టెక్నికల్ బిడ్స్, నవంబర్ 1న ఫైనాన్షియల్ బిడ్డింగ్ కు ఆర్టీసీ వెళ్లనుంది. రాష్ట్రంలోని విజయవాడ, విశాఖ, కాకినాడ, తిరుపతికి ఎలక్ట్రికల్ బస్సులు నడపనున్నారు. ఏడాదిలోగా వీటిని రోడ్ల మీదకు తెచ్చేలా సర్కార్ కసరత్తు చేస్తోంది.

టెండర్లకు ఆహ్వానించిన రూట్లు:

* కాకినాడ-రాజమండ్రి-అమలాపురం
* గన్నవరం-హనుమాన్ జంక్షన్
* విజయవాడ-గుడివాడ-భీమవరం
* జగ్గయ్యపేట-మచిలీపట్నం
* నూజివీడు-కోదాడ
* విజయవాడ-అమరావతి
* విజయవాడ-గుంటూరు
* విశాఖ-యలమంచిలి-భీమిలి-శ్రీకాకుళం-నర్సీపట్నం

Related posts