telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కిడ్నాప్ కేసులో ఇంకా పరారీలోనే అఖిలప్రియ భర్త

అఖిల ప్రియా కేసులో భార్గవ్ రామ్ ఇంకా పరారీ లోనే ఉన్నాడు. భార్గవ్ కోసం గాలిస్తున్నాయి ప్రత్యేక బృందాలు. ఇప్పటికే అరెస్ట్ అయి చంచల్ గూడ మహిళ జైలు ఉన్న అఖిల ప్రియా… నిన్న రాత్రి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఈ రోజు కోర్టు లో కొనసాగనున్నాయి వాదనలు. అఖిల ప్రియా గర్భవతి కావడం, ఫిట్స్ కూడా వస్తుండటంతో బెయిల్ పై ఉత్కంఠ నెలకొంది. మరో నిందితుడు ఏవి సుబ్బారెడ్డి కి 41crpc కింద నోటీసులు ఇచ్చి వదిలేసారు పోలీసులు. భార్గవ్ అరెస్ట్ తర్వాత ఏవి సుబ్బారెడ్డి స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉంది. ఐటీ అధికారులు గా ప్రవీణ్ రావు ఇంట్లో చొరబడిన వారు ఎవరు.. ఇప్పటి వరకు వాళ్ళను ఎందుకు అరెస్టు చేయలేదు.. కిడ్నాపర్లు గుర్తించాము, పట్టుకున్నామని పోలీసులు చెబుతున్నప్పటికి ఎక్కడ ఉన్నారనేది తెలియాల్సి ఉంది. పోలీసుల కన్నుగప్పి పారిపోయారా.. కిడ్నాపర్లు వదిలేసారు కాబట్టి ప్రవీణ్ రావు అతని సోదరులు క్షేమంగా ఇంటికి చేరుకున్నారా.. ఒకవేళ అదే నిజమైతే ఈ కేసులో పోలీసులు చేసింది కేవలం అఖిలప్రియ అరెస్టు మాత్రమేనా అనే ప్రశ్నలు వస్తున్నాయి. కిడ్నాపర్ల కోసం ఇంకా గాలింపు కొనసాగుతుంది. కిడ్నాప్‌ కేసు లో ఇప్పటి వరకు అఖిలప్రియా మాత్రమే అరెస్ట్ అయింది.

Related posts