telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆచార్య టీజర్ వచ్చేది ఎప్పుడంటే?

Aacharya

మెగాస్టార్ చిరంజీవి హీరోగా “ఆచార్య” చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ నటిస్తున్న ఈ చిత్రాన్ని సక్సెస్‌ఫుల్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ రూపొందిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై రామ్ చరణ్, నిరంజన్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. మెసేజ్ ఓరియంటెడ్ సినిమాగా ఈ చిత్రం తెరకెక్కినట్లుగా ఈ మోషన్ పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. ఈ చిత్రాన్ని సమ్మర్ 2021కి విడుదల చేయబోతున్నట్లుగా చిత్రయూనిట్ మోషన్ పోస్టర్‌లో ప్రకటించింది.  అయితే ప్రస్తుతం మెగా అభిమానులు ఎదురుచూస్తున్న ఏకైక విషయం ఆచార్య టీజర్. ఈ సినిమా టీజర్ విడుదల ఎప్పుడెప్పుడు అవుతుందా అని ఉవ్విళూరుతున్నారు. అయితే ఎట్టకేలకు దీనిపై ఓ తాజా అప్‌డేట్ వచ్చేసింది. ఈ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్ వచ్చే సమయం ఆసన్నమయింది. గణతంత్ర దినోత్సవ సందర్బంగా ఈ సినిమా టీజర్‌ను జనవరీ 26న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది. ఈ సినిమాలో తమ అభిమాన హీరో చిరు ఎలా కనిపిస్తాడా అని అభిమానులు వేచి చూస్తున్నారు.

Related posts