telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

అందుకే నేను కస్టమ్స్‌కు చెప్పలేదు : క్రునాల్

ఐపీఎల్ ముంబై ఇండియన్స్ జట్టులో కీలక ఆటగాడు అయిన క్రునాల్ పాండ్యా కేసును ముంబై విమానాశ్రయంలో కస్టమ్స్ దర్యాప్తు చేస్తుంది. యూఏఈ లో ఐపీఎల్ 2020 ముగించుకొని భారత్ కు తిరిగి వస్తున్న సమయంలో బంగారం ఇతర విలువైన వస్తువులను తీసుకువస్తున్నాడు అనే అనుమానంతో క్రికెటర్ క్రునాల్ పాండ్యాను ముంబై అంతర్జాతీయ విమానాశ్రయంలో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డిఆర్ఐ) అధికారులు ఆపేసారు. అతను తీసుకొని వచ్చిన వాటిలో నాలుగు లగ్జరీ గడియారాలు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి గురించి క్రునాల్ కస్టమ్స్‌కు తెలియజేయలేదని, దీనికి ఎటువంటి పన్ను చెల్లించలేదని డిఆర్‌ఐ అధికారులు తెలిపారు. ఈ గడియారాల విలువ దాదాపు కోటి ఉంటుందని అంచనా వేశారు అధికారులు. అయితే ఈ ముంబై ఇండియన్స్ స్టార్… తనకు డిక్లరేషన్ విధానం మరియు కస్టమ్స్ డ్యూటీ గురించి తెలియదని, అందువల్ల అతను గడియారాల గురించి  కస్టమ్స్‌కు చెప్పడంలో విఫలమయ్యానని  తెలిపాడు. ఈ కేసులో దర్యాప్తు పూర్తయిన తర్వాత, క్రునాల్ ఆ గడియారాల విలువలో 38 శాతం కస్టమ్స్ పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది. క్రునాల్ కస్టమ్స్ పన్ను మరియు జరిమానా చెల్లించిన తర్వాత, స్వాధీనం చేసుకున్న లగ్జరీ గడియారాలు అతనికి అప్పగించబడతాయి.

Related posts