telugu navyamedia
andhra news political

రెండు వేల జనాభా ఉన్న గ్రామంలో సెక్రటేరియట్‌: సీఎం జగన్

jagan

రెండు వేల జనాభా ఉన్న గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేస్తామని ఏపీ సీఎం జగన్ అన్నారు. సీఎం హోదాలో తొలిసారి కడప జిల్లాకు వచ్చిన జగన్ జమ్మలమడుగులో రైతు దినోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  50 ఇళ్లకు ఒక గ్రామ వాలంటీర్‌ను నియమిస్తామని, కుల, మత, ప్రాంతాలకు అతీతంగా పథకాలు అమలు చేస్తామని జగన్‌ స్పష్టం చేశారు. ఇది రైతు శ్రేయోభిలాషి ప్రభుత్వమని, రైతుల కోసమే పనిచేస్తామని అన్నారు.

రైతుల కోసం వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకం అమలు చేసిన విషయాన్ని ఈ సందర్భంగా జగన్ గుర్తు చేశారు. రైతులకు వడ్డీలేకుండా రూ. 84 వేల కోట్ల పంట రుణాలు ఇస్తామన్నారు. రైతులకు పగటిపూట 9 గంటల ఉచిత కరెంట్‌ ఇస్తున్నామని సీఎం జగన్ తెలిపారు. ఉచిత కరెంట్‌ కోసం రూ.1700 కోట్లు వెంటనే మంజూరు చేశామని అన్నారు. సెప్టెంబర్‌ 1 నుంచి నేరుగా అర్హుల ఇంటికే పెన్షన్‌ వస్తుందని జగన్ పేర్కొన్నారు. పెన్షన్‌ కోసం లంచాలు ఇవ్వాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు.

Related posts

అందుకే ఆయనను పెళ్లి చేసుకున్నా: మంత్రి పుష్ప శ్రీవాణి

vimala p

హైదరాబాద్ లో … 2.4 కోట్లు పట్టుకున్న ఈసీ ..

vimala p

సుప్రీంకోర్టు తదుపరి చీఫ్ జస్టిస్ గా ఎస్ఏ బాబ్డే: రాష్ట్రపతి ఉత్తర్వులు

vimala p