telugu navyamedia
news telugu cinema news

మనసంతా నువ్వే కు 19 ఏళ్ళు…

ఎవర్‌గ్రీన్‌ ప్రేమకథా చిత్రాలగా నిలిచిన వాటిలో ‘మనసంతా నువ్వే’ చిత్రం ఒకటి. దర్శకుడు వి.ఎన్‌ ఆదిత్య అద్భుతంగా చిత్రీకరించిన ఈ సినిమా నేటితో 19 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో నటించిన ఉదయ్ కిరణ్‌, రీమాసేన్‌కు కూడా మంచి గుర్తింపు లభించింది. ఈ సినిమాలోని పాటలు సూపర్ హిట్ ఆల్బమ్ గా నిలిచింది. ఆర్‌పి పట్నాయక్‌ అందించిన మ్యూజిక్‌ ఇప్పటికీ గుర్తుండిపోతుంది.

ఈ సందర్భంగా… నిర్మాత ఎం.ఎస్‌ రాజు నాటి జ్ఞాపకాలను ట్విట్టర్‌లో షేర్‌ చేశారు. ‘దేవీ పుత్రుడు’ సినిమాతో ఆర్థిక నష్టాల్లో కూరుకుపోయిన ఆయనకు ‘మనసంతా నువ్వే’ సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టి ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసిందని తెలిపారు. రూ.1.3 కోట్లతో తీసిన సినిమా అప్పట్లోనే రూ.16 కోట్లు వసూలు చేసింది.

Related posts

తన కూతురితో ఉన్న అద్భుతమైన ఫోటో షేర్ చేసిన రోహిత్ …

Vasishta Reddy

“ఢీ” సీక్వెల్ కు రెడీ అవుతున్న మంచు విష్ణు

vimala p

ఆ గ్రామ సచివాలయంలో సీఎం జగన్ స్థానంలో ఎన్టీఆర్ ఫోటో… వివాదాస్పదం

vimala p