telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

వైరల్ : రక్తంతో స్నానం చేస్తున్న హన్సిక

Maha

ఒకప్పుడు జూనియర్ ఖుష్బూగా ప్రశంసలు అందుకున్న హీరోయిన్ హాన్సిక. ప్రస్తుతం అవకాశాలు లేక టాలీవుడ్ వెండితెరకు దూరమైంది. కానీ, కోలీవుడ్‌లో స్థిరపడిపోయింది. ఈమె ప్రస్తుతం నటిస్తున్న 50వ చిత్రం పేరు “మ‌హా”. యూఆర్ జ‌మీల్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్నారు. హీరోయిన్ సెంట్రిక్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో గ‌తంలో ఎప్పుడూ చేయ‌ని పాత్ర‌ని హ‌న్సిక ఈ చిత్రంలో చేస్తుంద‌ని అంటున్నారు. ఇందులో విల‌క్ష‌ణ పాత్ర చేస్తున్న హ‌న్సిక ఎమోష‌న్స్‌ని అద్భుతంగా పండించ‌నుంద‌ట‌. తాజాగా కొత్త సంవత్సరం సందర్భంగా “మహా” సినిమాలోని మరో కొత్త పోస్టర్ ను విడుదల చేశారు. ఈ పోస్టర్ లో హన్సిక రక్తస్నానం చేస్తోంది. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారింది.

గిబ్రాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. గిబ్రాన్ కెరీర్లో ఇది 25వ చిత్రం కావడం మరోవిశేషం. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్ లుక్ లో హన్సిక కాషాయ వస్త్రాలు ధరించి, సింహాసనం పై కూర్చొని పొగ తాగుతూ కన్పించడం వివాదాస్పదమైంది. ఇక హన్సిక ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తున్న “ఎన్టీఆర్ బయోపిక్”లో, మరోవైపు తెలుగులో సందీప్ కిష‌న్‌తో క‌లిసి జి.నాగేశ్వరరెడ్డి దర్వకత్వంలో ‘తెనాలి రామకృష్ణ బి.ఎ.బి.యల్’ అనే మూవీలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే.

Related posts