వైసీపీ ప్రభుత్వం చేపట్టిన సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర నాల్గవ రోజు ఆదివారం నంద్యాలలో ప్రారంభమైంది. నంద్యాల నుంచి ప్రారంభమైన బస్సు యాత్ర సాయంత్రానికి అనంతపురంలో బహిరంగ సభతో ముగియనుంది.
నాలుగో రోజు యాత్ర బస్సు యాత్ర ప్రారంభానికి ముందు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం చేయడమే ఈ బస్సుయాత్ర ముఖ్య ఉద్దేశమని అన్నారు.
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు రాజ్యాధికారం వైపు నడిపిస్తున్న వ్యక్తి సీఎం జగన్ అని అన్నారు.వైసీపీ ప్రభుత్వంలో 25 మంది మంత్రులు ఉంటే అందులో 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సామాజిక వర్గానికి చెందినవారు ఉన్నారని అంజాద్ భాషా తెలిపారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలోనే సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి.ఒక క్యాలెండర్ పెట్టి సంక్షేమ ఫలాలు అందిస్తున్న ఏకైన సీఎం జగన్ మాత్రమే.
కాగా ఈ బస్సు యాత్ర ఆదివారంతో ముగియనుంది. ఇవాళ సాయంత్రం అనంతపురంలో జరిగే బహిరంగ సభలో మంత్రులు పాల్గొననున్నారు.
నాలుగున్నరేళ్లు టైమ్ పాస్ చేసిన చంద్రబాబు: జగన్