*ఇచ్చిన మాట నుంచి వైఎస్సార్‌సీపీ పుట్టింది
*కాంగ్రెస్ పార్టీ పొమ్మనలేక పొగపెట్టింది..
*జగన్‌పై మీ అభిమానం చూసి చాలా గర్విస్తున్నా
*ప్రజలకు ఇచ్చిన మాట కోసం జగన్ నిలబెడ్డాడు..
*వైఎస్ నా వాడే కాదు..మీ అందరి వాడు..
*జగన్ ఒక మాస్ లీడర్..
వైఎస్సార్ అందరివాడని.. కోట్ల మంది హృదయాల్లో సజీవంగా ఉన్నారని వైఎస్ విజయమ్మ అన్నారు. వైఎస్సార్ 73వ జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్‌సీపీ నిర్వహిస్తున్నారు. ప్లీనరీ సమావేశాలకు హాజరైన వైఎస్ విజయమ్మ మాట్లాడుతూ.. రాజశేఖరరెడ్డి అందరివాడు. మీ అందరి హృదయాల్లో వైఎస్సార్‌గారు సజీవంగా ఉన్నారని అన్నారు.
వైఎస్‌ఆర్ కుటుంబానికి అండగా ఉన్న ప్రతిఒక్కరికీ వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ధన్యవాదాలు తెలిపారు.జగమంతా తన కుటుంబంలా వైఎస్‌ఆర్ ప్రేమించారన్నారు. ప్రజల హృదయాల్లో వైఎస్‌ఆర్ సజీవంగా ఉన్నారని అన్నారు. ‘‘మిమ్మల్ని ఆశీర్వదించడానికి, అభినందించడానికే నేను వచ్చా’’ అని తెలిపారు.

ప్రజల అభిమానం, ఇచ్చిన మాట నుంచి వైఎస్సార్‌సీపీ పుట్టిందని.. ఎన్నో కష్టాలను ఎదుర్కొని నిలిచామని వైఎస్ విజయమ్మ అన్నారు. అన్యాయంగా కేసులు పెట్టి వేధించారు. అధికార శక్తులన్నీ జగన్‌పై విరుచుకుపడ్డా బెదరలేదు. జగన్ ఓర్పు, సహనంతో ఎంతో ఎత్తుకు ఎదిగారు. ఈ రోజు సగర్వంగా ప్లీనరీ జరుపుకుంటున్నామని అన్నారు.
కాంగ్రెస్ పొమ్మనలేక పొగబెట్టిందని విమర్శించారు. విచారణ పేరుతో జైల్లో పెట్టి..ఆస్తుల్ని సీజ్ చేశారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జగన్ బెదరలేదని తెలిపారు. ప్రజల అండతో జగన్ అధికారంలోకి వచ్చారని విజయమ్మ అన్నారు. ఎలాంటి వివక్ష లేకుండా అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నారని వైఎస్ విజయమ్మ అన్నారు.
వైఎస్ జగన మాస్ లీడర్.. జగన్ యువతకు రోల్‌మోడల్. మీ అందరి ప్రేమ సంపాదించిన జగన్‌ను చూసి చాలా చాలా గర్వపడుతున్నా అని విజయమ్మ అన్నారు. నా బిడ్డను నడిపించుకోమని మీకే అప్పజెప్పా. నా బిడ్డను నడిపించిన మీ అందరిపైనా నా అణువణువునా కృతజ్ఞత ఉంది. మీ బిడ్డల్ని జగన్ చేతుల్లో పెట్టండి, వారికి ఉజ్వల భవిష్యత్ అందిస్తారు. మీతో నా అనుబంధం ఈనాటిది కాదు, 45 ఏళ్ల అనుబంధం ఉంది. ఇకపైనా ఈ అనుబంధం కొనసాగాలి అంటూ వైఎస్ విజయమ్మ భావోద్వేగానికి గురయ్యారు.


ఏపీకి ఇప్పటికే 42 వేల కోట్ల అప్పులు: దేవినేని ఉమ