వైఎస్ వివేకా కూతురు.. సీబీఐ దర్యాప్తుపై ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన తర్వాత.. ఈ ఘటన పై నేతలు తమ వ్యాఖ్యలకు మరింత పదును పెట్టారు.. అయితే, ఈ వ్యవహారంపై స్పందించిన వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి.. సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైఎస్ వివేకా హత్యతో తమకు సంబంధంలేదని మేం ప్రమాణం చేస్తాం.. కానీ, ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి ప్రమేయం లేదని నారా లోకేష్ ప్రమాణం చేయగలరా? అని ప్రశ్నించారు.. ఇక, వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ విచారణ అవసరం లేదని సీఎం వైఎస్ జగన్ ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు వైసీపీ ఎమ్మెల్యే.. మరోవైపు.. రమణ దీక్షితులు తనకు జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని వ్యాఖ్యలు చేసి ఉంటారన్న ఆయన.. సీఎం జగన్.. తాను దేవుడు, రాముడు, జీసన్ అని ఎప్పుడూ చెప్పకోలేదన్నారు.. తిరుపతిలో సీఎం జగన్ ప్రచారంపై వస్తున్న విమర్శలపై స్పందిస్తూ.. వైఎస్ జగన్ భయపడి ప్రచారానికి వస్తున్నారని ఎవరైనా భావిస్తే అది అపోహే అవుతుందన్నారు. అయితే చూడాలి మరి ఇంకా ఏం జరగనుంది అనేది.


సంక్షేమ పథకాల పేరుతో అరచేతిలో స్వర్గం.. కేసీఆర్ పై విజయశాంతి ఫైర్