telugu navyamedia
ఆరోగ్యం

‘కొబ్బరి’ తో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

ప్రపంచ కొబ్బరి దినోత్సవం సందర్భంగా.. కొబ్బరి ప్రయోజనలేంటో తెలుసుకుందాం. ప్రకృతి ఇచ్చిన కొన్ని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలలో కొబ్బరి ఒకటి. కొబ్బరి ఆవష్యకతను, కొబ్బరి వల్ల కలిగే ప్రయోజనాలపై అందరిలోనూ అవగాహన కలిపించేందుకు గాను ప్రతీ ఏటా సెప్టెంబర్‌ 2ను ప్రపంచ కొబ్బరి దినోత్సవం (వరల్డ్‌ కొకనట్‌ డే)గా నిర్వహిస్తారు.

కొబ్బరి వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు:

* ప‌చ్చి కొబ్బరిని తీసుకోవ‌డం వ‌ల్ల శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. పచ్చికొబ్బరిలో ఉండే ఆరోగ్యకరమైన కొవ్వులు మన శరీరంలోని కొవ్వును కరిగిస్తాయి.
* కొబ్బరిలో ఉండే యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైరల్‌ గుణాలు రోగ నిరోధ‌క శ‌క్తి పెంచ‌డంలో కీల‌క పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా గొంతు, బ్రాంకైటిస్ స‌మ‌స్యలు త‌గ్గుతాయి.
* కొబ్బరిని క్రమం త‌ప్పకుండా తీసుకోవ‌డం వ‌ల్ల భ‌విష్యత్తులో వ‌చ్చే అల్జీమ‌ర్స్ వంటి వ్యాధుల‌కు చెక్ పెట్టవ‌చ్చు. అంతేకాకుండా మాన‌సిక ఆరోగ్యాన్ని మెరుగుప‌ర‌చ‌డంలోనూ కొబ్బరి కీల‌క‌పాత్ర పోషిస్తుంది.


* కొబ్బరిలో ఫైబ‌ర్ పుష్కలంగా ఉంటుంది. దీని వ‌ల్ల జీర్ణ వ్యవ‌స్థ మెరుగుప‌డుతుంది. ఇక కొబ్బరిని తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. పేగుల్లో క‌ద‌లిక‌లు బాగుంటాయి. దీంతో మ‌ల‌బ‌ద్దకం స‌మ‌స్య నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చు. అంతేకాకుండా పైల్స్‌ వంటి సమస్యలతో బాధపడుతోన్న వారికి ఉపశమనం లభిస్తుంది.
* పొడి చ‌ర్మం, వెంట్రుక‌లు చిట్లడం వంటి స‌మ‌స్యల‌తో బాధ‌ప‌డుతోన్నవారికి కొబ్బరి దివ్యౌష‌ధంగా ప‌నిచేస్తుంది. చ‌ర్మంలో తేమ‌ను పెంచ‌డంలో కూడా కొబ్బరి కీల‌క పాత్ర పోషిస్తుంది. దీంతో చ‌ర్మ సౌంద‌ర్యం మెరుగుప‌డుతుంది. కొబ్బరిలో ఉండే మోనోలారిన్‌, లారిక్‌ యాసిడ్‌లు యాంటీ బాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ ఏజెంట్‌గా పనిచేస్తుంది. దీంతో మొటిమలు తగ్గుతాయి.


* తరచూ తలనొప్పులతో బాధపడేవారు… రోజూ ఎండు కొబ్బరి కాస్త తింటూ ఉంటే… బ్రెయిన్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అంతేకాదు… రకరకాల వ్యాధుల్ని తరిమికొట్టే శక్తి కూడా డ్రై కోకోనట్‌కి ఉంది.
* రోజూ ఎండుకొబ్బరి తింటే.. బ్రెయిన్ బాగా పనిచేస్తుంది. మతిమరపు సమస్యలు దూరమవుతాయి.
* పేగుల్లో కాన్సర్, ప్రొస్టేట్ కాన్సర్‌కి ఎండుకొబ్బరి చక్కటి మందులా పనిచేస్తోంది.
*మహిళలు ఎండుకొబ్బరి తినడం ద్వారా వారిలో ఐరన్ పెరిగి ఆరోగ్యంగా ఉంటారు.
* కొబ్బరి ముక్క నమలం ద్వారా ఎనీమియా (రక్తహీనత) సమస్యకు చెక్‌ పెట్టావచ్చు

Related posts