దేశవ్యాప్తంగా కరోనా, బ్లాక్ ఫంగస్ విజృంభణ కొనసాగుతుండగా.. తాజాగా, బ్లాక్ ఫంగస్‌ను అంటువ్యాధిగా పరిగణించాలంటూ తాజాగా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లేఖలు రాసింది. కేసులు వెలుగు చూడగానే తమకు సమాచారం ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రలతో పాటుగా దేశంలోని మరిన్ని రాష్ట్రాలలో ఈ బ్లాక్ ఫంగస్ కేసులు బయటపడ్డాయి. అయితే ఇప్పుడు మరో కొత్త ఫంగస్ భారత్ లో బయపడింది. తాజాగా వైట్ ఫంగస్ బయట పడడం కలకలం రేపుతోంది. బీహార్ లో కొత్తగా వైట్ ఫంగస్ సోకిన నలుగురిని గుర్తించారు అధికారులు. ఇక ఈ వైరస్ కూడా కరోనా లక్షణాలనే పోలి ఉంది అని చెబుతున్నారు. ముఖ్యంగా రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్న వారికే ఈ కొత్త వైట్ ఫంగస్ సోకె అవకాశం ఉన్నట్లు తెలుపుతున్నారు. అప్రమత్తమైన వైద్యులు.. ప్రజలను హెచ్చరిస్తున్నారు. ఇది.. మహిళలు, పిల్లల్లో చాలా ప్రమాదకరమని వార్నింగ్ ఇచ్చారు. ఇక, బ్లాక్ ఫంగస్ కంటే ఇది చాలా తీవ్రమైనదే కాకుండా శరీరంలోని అనేక భాగాలను తీవ్రంగా దెబ్బతీస్తుందని చెబుతున్నారు వైద్యులు.
previous post