telugu navyamedia
సాంకేతిక

సోషల్‌ మీడియా బాధితులకోసం ప్రత్యేక వెబ్‌సైట్‌

fake news by old age users of facebook
సోషల్ మీడియాలో రోజు రోజుకు ప్రముఖులు, సామాన్యులపై దుష్ప్రచారాలు పెరిగిపోతున్నాయి. ఎందరో తమ గోడును బాహాటంగా వినిపించేందుకు ఇష్టపడడం లేదు. ఈ నేపథ్యంలో  ‘హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా’ సౌత్‌ రీజన్‌ తీవ్రంగా స్పందించింది. ఇటీవల ప్రముఖలను టార్గెట్‌ చేస్తూ వారిపై ఇష్టానుసారంగా సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం జరగడం, బాధితులు పోలీస్‌ స్టేషన్‌ మెట్లు ఎక్కడం బాధగా ఉందని సౌత్‌రీజన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ జి.అనూహ్యరెడ్డి అన్నారు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్న వారికి తాము అండగా ఉంటామని తెలిపారు. 
 బాధితులను సంఘటితం చేస్తూ ఇలాంటి దుష్ప్రచారాన్ని అరికట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఇందులో భాగంగా సౌత్‌ఇండియాలో ఓ వైబ్‌సైట్‌ను రూపొందించనున్నట్లు తెలిపారు. ఈ వెబ్‌సైట్‌ ద్వారా ప్రతి ఒక్కరూ తమ సమస్యను అప్‌లోడ్‌ చేస్తే తమకు నేరుగా మెసేజ్‌ అందుతుందన్నారు. బాధితులతో అప్పటికప్పుడు మాట్లాడి, వివరాలు తెలుసుకుని సమీపంలోని పోలీసు స్టేషన్‌కు అనుసంధానం చేస్తామన్నారు.

Related posts