telugu navyamedia
సినిమా వార్తలు

నాగ చైతన్యకు తాతగా మారనున్న నాగార్జున

Nagarjuna Naga Chaitanya
సరిగ్గా మూడేళ్ళ క్రితం సంక్రాంతికి నాగార్జున ప్రధానపాత్రలో వచ్చిన “సోగ్గాడే చిన్ని నాయనా” చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో నాగార్జున పోషించిన “బంగార్రాజు” పాత్రలో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో సోగ్గాడే చిన్నిం నాయనా చిత్రానికి సీక్వెల్ గా “బంగార్రాజు” చిత్రాన్ని తెరకెక్కించాలని, అందుకు మంచి కథను సిద్ధం చేయమని దర్శకుడు కళ్యాణ్ కృష్ణకి నాగార్జున చెప్పి చాలా రోజులైపోతోంది. అప్పటి నుంచి కళ్యాణ్ కృష్ణ కథలు విన్పిస్తున్నా… అవి నాగార్జునకు నచ్చకపోవడంతో సినిమా పట్టాలెక్కలేదు.
కథలో మార్పులు, చేర్పుల అనంతరం తాజాగా కళ్యాణ్ కృష్ణ చెప్పిన కథతో నాగార్జున సంతృప్తి చెందారట. దీంతో “బంగార్రాజు” సినిమాకు గ్రీన్ సిగ్నల్ లభించింది. అన్నపూర్ణ బ్యానర్లో ఈ సినిమాను పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో నాగార్జునతోపాటు నాగ చైతన్య కూడా కీలకపాత్ర పోషించనున్నాడట. నాగార్జున తాత పాత్రలో నటిస్తుండగా… నాగచైతన్య మనవడి పాత్రలో కన్పించనున్నాడని సమాచారం. వచ్చే సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలనీ భావిస్తున్నారట చిత్రబృందం.

Related posts