telugu navyamedia
సాంకేతిక

న్యూ యాప్‌ను ప్రారంభించిన రైల్వే..

మనం రైల్లో దూర ప్రయాణం చేయాలంటే ముందుగానే టికెట్‌ బుక్‌ చేసుకుంటాం. ఇప్పుడు టిక్కెట్‌ బుకింగ్‌ రైల్వే స్టేషన్‌కు వెళ్లకుండానే IRCTC ద్వారా మొబైల్‌నుంచి రిజర్వ్‌ చేసుకుంటున్నాం. అయితే చాలా సార్లు టికెట్ వెయిటింగ్‌ లిస్ట్‌లో ఉంటుంది… కొన్ని సమయాలలో టికెట్‌ కన్‌ఫర్మ్‌ కాకపోతే డబ్బు వాపసు రావడం జరుగుతుంది.

IRCTC వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్ నుంచి సమయానికి టికెట్ క్యాన్సిల్‌ చేసుకున్నట్లయితే చిన్న క్లరికల్ ఛార్జీలను తీసివేసి మొత్తం డబ్బు తిరిగి ఇస్తారు. రైల్వే నిబంధనల ప్రకారం టిక్కెట్ రద్దు చేయడం ఎంత ఆలస్యం చేస్తే అంత ఎక్కువ డబ్బు కట్‌ చేస్తారు.

This is what Indian Railways wants to deploy to counter bad publicity for  IRCTC | Zee Business

అయితే టికెట్ క్యాన్సిల్ చేయ‌డం వ‌ల్ల రిఫండ్ చాలా ఆల‌స్యంగా వ‌స్తుంది. కొన్నిసార్లు మూడు నాలుగు రోజులు ప‌ట్ట‌వ‌చ్చు. కానీ ఇప్పుడు రైల్వే కొత్త యాప్‌ను ప్ర‌వేశ పెట్టింది. దీని పేరు i pay దీంట్లో చాలా త‌క్కువ స‌మ‌యంలో మీ రీఫండ్‌ డ‌బ్బులు చాలా త్వ‌ర‌గా వ‌చ్చేస్తాయి. IRCTC ప్రారంభించిన ఈ i pay చాలా సుర‌క్షిత‌మైన‌ది. పైగా దీంతో త‌క్కువ స‌మ‌యంలో టికెట్ బుకింగ్ చేసుకోవ‌చ్చు.

అలాగే టికెట్ క్యాన్సిల్ చేసిన‌ప్పుడు రీఫండ్ కోసం కూడా వేచి చూడాల్సిన అవ‌స‌రం లేదు. వెంట‌నే డ‌బ్బులు రీఫండ్ అవుతాయి. i pay పూర్తిగా సుర‌క్షిత‌మైన‌ది.

Related posts