telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

ఏపీ అభివృద్ధి ప్రస్థానంలో మేం కూడా భాగస్వామ్యం అయితే ఎంతో గర్విస్తాం: ఆనంద్ మహీంద్రా

మహీంద్రా కంపెనీ నుంచి కొత్తగా ఫ్యూరియో-8 ట్రక్కులు మార్కెట్లోకి విడుదలైన సందర్భంగా తమ తెలుగు అడ్వర్టయిజ్ మెంట్ వీడియోను ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా నిన్న సోషల్ మీడియాలో పంచుకున్నారు.

తెలుగులో చేసిన ఈ ట్వీట్ ను ఏపీ మంత్రి నారా లోకేశ్ రీట్వీట్ చేసి, ఆ యాడ్ బాగుందంటూ కితాబిచ్చారు.

ఏపీలో పరిశ్రమ స్థాపనకు అన్ని అవకాశాలు ఉన్నాయని, మహీంద్రా సంస్థ దీనిపై ఆలోచించాలని కోరారు.

దీనిపై నేడు ఆనంద్ మహీంద్రా స్పందించారు. మంత్రి నారా లోకేశ్ కు ధన్యవాదాలు తెలిపారు.

“ఏపీలో అనేక అవకాశాలు ఉన్నాయి. ఏపీ అభివృద్ధి ప్రస్థానంలో మేం కూడా భాగస్వామ్యం అయితే ఎంతో గర్విస్తాం.

సోలార్ ఎనర్జీ, సూక్ష్మ నీటిపారుదలతో పాటు టూరిజం వంటి వివిధ రంగాలకు సంబంధించి మా బృందాలు ఇప్పటికే చర్చలు జరుపుతున్నాయి.

మన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమైంది మున్ముందు ఏం జరగనుందో చూద్దాం” అని ఆనంద్ మహీంద్రా ఆశాభావం వ్యక్తం చేశారు.

Related posts