telugu navyamedia
రాజకీయ

సీబీఐ కొత్త డైరెక్టర్ గా రిషి కుమార్ శుక్లా

Rishi Kumar Shukla
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలోని సెలెక్షన్ ప్యానెల్ శనివారం ఐపీఎస్ అధికారి, మధ్యప్రదేశ్ మాజీ డీజీపీ అయిన రిషి కుమార్ శుక్లాను కొత్త సీబీఐ డైరెక్టర్ గా నియమించింది. శుక్లా ప్రస్తుత తాత్కాలిక డైరెక్టర్ ఎం. నాగేశ్వర రావు నుంచి బాధ్యతలు స్వీకరిస్తారు. గత నెలలో ఆలోక్ వర్మపై ప్యానెల్ వేటు వేసినప్పటి నుంచి నాగేశ్వరరావు సీబీఐ తాత్కాలిక చీఫ్ గా ఉన్నారు. 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే సభ్యులుగా ఉన్న హై పవర్డ్ కమిటీ 1983 బ్యాచ్ కి చెందిన రిషి కుమార్ శుక్లా పేరును షార్ట్ లిస్ట్ చేసిన 30 మందికి పైగా పేర్ల నుంచి ఎంపిక చేయడం జరిగింది. ఆర్ కె శుక్లా సీబీఐ అత్యున్నత పదవిలో రెండేళ్ల పాటు కొనసాగనున్నారని ఒక ప్రకటనలో తెలియజేశారు.

Related posts