telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

ఆధార్ పోతే.. మళ్ళీ ఇలా చేస్తే సరి..

aadhar

అనివార్య కారణాలలో ఆధార్ కార్డు పోగొట్టుకున్నారా.. మళ్ళీ ఎలా పొందాలో తెలియడంలేదా.. బెంగ వద్దు, ఇలా చేసేయండి. ఆధార్ ఎన్ రోల్ మెంట్ సెంటర్ల ద్వారా తిరిగి పొందాల్సి ఉంటుంది, లేదా ఆధార్ కార్డు నంబర్ గుర్తు ఉన్నా, ఆధార్ కార్డు జిరాక్స్ ఉన్నా అధికారిక వెబ్ సైట్ నుండి ఆధార్ కార్డు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధార్ కలిగి ఉన్న ప్రతి ఒక్కరి కోసం ఎం ఆధార్ యాప్ అందుబాటులోకి తెచ్చింది. ఐఓఎస్ యూజర్లు యాపిల్ స్టోర్ నుంచి ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఎం ఆధార్ యాప్ డౌన్ లోడ్ చేసుకుని ఆధార్ కార్డును ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఎం ఆధార్ యాప్ లో ఎన్నో ఫీచర్లు ఉన్నాయి. ఆధార్ కార్డు ఉన్నవాళ్లతో పాటు లేనివాళ్లు కూడా ఈ యాప్ ఉపయోగించవచ్చు.

ఈ యాప్ ద్వారా ఆధార్ కార్డు పాడైపోతే రిక్వెస్ట్ పెట్టుకొని ఆధార్ కార్డును మరలా పొందవచ్చు. 13 భాషల్లో ఎం ఆధార్ యాప్ ను ఉపయోగించవచ్చు. ఆధార్ కార్డును పోగొట్టుకున్న వాళ్లు కూడా ఈ యాప్ ద్వారా ఆధార్ కార్డును పొందవచ్చు. యాప్ లో రీ ప్రింట్ కోసం రిక్వెస్ట్ పెట్టి 50 రూపాయలు చెల్లిస్తే ఆధార్ కార్డును పొందవచ్చు. సమీప ఎన్ రోల్ మెంట్ సెంటర్ వివరాలు కూడా ఈ యాప్ లో నమోదై ఉంటాయి. రైళ్లలో ప్రయాణం చేసే సమయంలో ఐడీ ప్రూఫ్ గా కూడా ఎం ఆధార్ యాప్ లోని ఆధార్ ను చూపించవచ్చు. ఇంటర్నెట్ ఉన్న సమయంలో మాత్రమే ఎం ఆధార్ యాప్ ఉపయోగించవచ్చు. ఆధార్ కార్డు పోయినా కంగారు పడాల్సిన అవసరం లేకుండా ఎం ఆధార్ యాప్ ద్వారా ఆధార్ కార్డును సులభంగా పొందవచ్చు. రీప్రింటెండ్ ఆధార్ పోస్టాఫీస్ ద్వారా రిజిష్టర్డ్ అడ్రస్ కు పోస్ట్ లో వస్తుంది.

Related posts