telugu navyamedia
ఆంధ్ర వార్తలు

దేశాన్ని మోదీ ఓ రాజులా పాలిస్తున్నాడు..కేసీఆర్ కరెక్ట్ రూట్‌లోనే వెళ్తున్నారు..

*దేశాన్ని మోదీ ఓ రాజులా పాలిస్తున్నాడు-ఉండవల్లి

*కేసీఆర్‌తో బీఆర్ఎస్‌పై చర్చించలేదన్న ఉండవల్లి
*ఏపీలో ఎవరు గెలిచినా పాతిక ఎంపీలు బీజేపీవే-ఉండవల్లి
*ఏపీలో బీజేపీ బలంగా ఉంది.. ఉండవల్లి
*కేసీఆర్ కరెక్ట్ రూట్‌లోనే వెళ్తున్నారు–ఉండవల్లి

*దేశంలో ప్రతిపక్షం ఉండొద్దన్నది బీజేపీ విధానమం

*బీజేపీపై కేసీఆర్ ది, నాది ఒకే అభిప్రాయం

దేశంలో ప్రతిపక్షం ఉండొద్దన్నది బీజేపీ విధానమని పేర్కొన్నారు. వ్యతిరేకించినవారిపై ఈడీ, సీబీఐ, ఐటీతో దాడులు చేయిస్తున్నారని ఉండవల్లి అరుణ్‌కుమార్ మండిప‌డ్డారు.

తెలంగాణ సీఎం కేసీఆర్ పది రోజుల కిందట తనకు ఫోన్ చేసి కలుద్దామన్నారని..హైదరాబాద్ వస్తే కలవాలని ఫోన్ చేశారు. అయితే పార్టీ ఏర్పాటుపై ఆయన నాతో చర్చించలేదు.. కేవలం బీజేపీ గురించే నాతో మాట్లాడార‌ని వెల్ల‌డించారు. దేశంలో బీజేపీ అనుసరిస్తున్న విధానాల వల్ల చాలా నష్టం జరుతుందని కేసీఆర్ తనతో చెప్పారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు.

సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఏపీ లో ఏ పార్టీ గెలిచినా పాతిక పార్లమెంట్ సీట్లు బీజేపీ లానే పరిస్థితి ఉందని, ఏ పార్టీ గెలిచినా బీజేపీ ఖాతాలోకే వెళ్లినట్లేనన్నారు. అందుకే అందుకే దేశంలో ఎక్కడా లేనంత బలంగా ఏపీలో బీజేపీ ఉందని అన్నారు. జగన్, పవన్, చంద్రబాబు కూడా బీజేపీకే మద్దతిస్తున్నాయ‌ని అన్నారు.

ప్రధానమంత్రి మోదీ ఓ రాజులా పరిపాలిస్తున్నారన్నారు. వైసీపీకి ఉన్న బలంతో ఏపీకి కావాల్సినవి సాధించుకోవచ్చని.. కానీ జగన్ మాత్రం అలాంటి ప్రయత్నం చేయడం లేదన్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి అనుకూలంగా లేకుండా సీఎం జగన్‌ నిలబడితే ప్రత్యేక హోదాతోపాటు అన్నీ సాధించుకోవచ్చన్నారు.

ఇక పవన్‌ను సీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటించదని.. ఒంటరిగానే పోటీ చేస్తుందని చెప్పారు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా నిలబడగల శక్తి కేసీఆర్‌కు ఉందన్నారు. బీజేపీ వ్యతిరేకులను లీడ్‌ చేయగల సత్తా కూడా ఆయనకు ఉందని చెప్పారు. ఆయనకు క్లారిటీ ఉందని.. బీజేపీ ఇంకా ఎదిగితే చాలా ప్రమాదమనే విషయంపైనా పూర్తి అవగాహన ఉందన్నారు.

బీజేపీకి తాను వ్యతిరేకం కాదని కానీ.. ఆ పార్టీ విధానాలకుదేశాన్ని బీజేపీ ఇబ్బంది పెడుతున్నాయి. బీజేపీపై కేసీఆర్ ది, నాది ఒకే అభిప్రాయ‌మ‌ని అన్నారు.

బీజేపీకి చెక్ పెట్టాలంటే ప్రతిపక్షాలు బలంగా ఉండాలన్నారు. దేశంలో ప్రతిపక్షం ఉండొద్దన్నది బీజేపీ విధానమని పేర్కొన్నారు. వ్యతిరేకించినవారిపై ఈడీ, సీబీఐ, ఐటీతో దాడులు చేయిస్తున్నారని ఉండవల్లి అరుణ్‌కుమార్ దుయ్యబట్టారు. అందుకే త‌న‌ను మాట్లాడడానికి పిలిచారని చెప్పారు.

బీజేపీ వ్యతిరేక శక్తులను ఏకం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని.. మోదీతో సమానంగా ఆయన కమ్యూనికేట్ చేయగలరన్నారు. మోదీకి వ్యతిరేకంగా విపక్షాలను ఏకం చేయగల సామర్థ్యం కేసీఆర్‌కు ఉందని ఉండవల్లి అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ వీక్ అవుతోంది కాబట్టి బీజేపీకి గట్టి కౌంటర్ అటాక్ ఎవరు ఇవ్వాలని ఉండవల్లి ప్రశ్నించారు.

బీజేపీ వల్ల రాబోయే రోజుల్లో మరింత ప్రమాదం పెరుగుతుందని.. దేశ రాజకీయాలపై కేసీఆర్ తనకన్నా ఎక్కువ స్టడీ చేశారని అరుణ్ కుమార్ పేర్కొన్నారు. బీజేపీ వల్ల దేశానికి జరిగే నష్టాన్ని.. ప్రజలకు వివరించాలన్నదే తన ఉద్దేశ్యమని అరుణ్ కుమార్ పేర్కొన్నారు. మమతా, స్టాలిన్, అఖిలేష్, ఠాక్రే లాంటి వాళ్లు చాలా మంది వున్నా.. కేసీఆర్‌లా వాళ్లు మాట్లాడలేరని ఆయన ప్రశంసించారు.

జాతీయ పార్టీని ఆల్టర్నేటివ్‌గా డెవలప్ చేయాలనేది కేసీఆర్ కాన్సెప్ట్ అని ఆయన స్పష్టం చేశారు. నెహ్రూకి కేసీఆర్ పెద్ద ఫ్యాన్ అని ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రశంసించారు. కేసీఆర్ కరెక్ట్ రూట్‌లోనేవెళ్తున్నారని తాను భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. విద్యుత్ సహా అన్ని అంశాలపై అవతలివారు కౌంటర్ చేయలేనంతగా కేసీఆర్ హోంవర్క్ చేశారని ఉండవల్లి తెలిపారు.

మూడు గంటల పాటు జరిగిన చర్చలో కేసీఆర్ చెప్పిన విషయాలు విని తాను ఆశ్చర్యపోయానన్నారు . పది రోజుల్లో మరోసారి కలుద్దామని చెప్పారని.. ఎప్పుడు పిలిచినా వస్తానని తాను హామీ ఇచ్చినట్లుగా ఉండవల్లి తెలిపారు. కేసీఆర్‌కు తనకన్నా ఎక్కువ తెలుసన్నారు.

Related posts