మొదటి మ్యాచ్ లో భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను పక్కన పెట్టడం పై మాజీ ఓపెనర్ సెహ్వాగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసాడు. మ్యాచ్ ప్రారంభమయ్యే వరకు రోహిత్ జట్టులో ఉంటాడని భావించిన అభిమానులకు ఊహించని షాక్ తగిలింది. అయితే రోహిత్ లేకపోవడంతో భారత్ తగిన మూల్యం చెల్లించుకుంది. అయితే ఈ విషయం పై సెహ్వాగ్ మాట్లాడుతూ… రోహిత్ శర్మలా కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా విశ్రాంతినిస్తారా? ప్రశ్నించాడు. ‘తొలి రెండు టీ20ల నుంచి రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చారు. మరీ ఈ రూల్ కెప్టెన్ విరాట్ కోహ్లీకి కూడా వర్తిస్తుందా? ఓ కెప్టెన్‌గా అతను ముందుకొచ్చి నాకు విశ్రాంతి కావాలని అడుగుతాడని నేను అనుకోవడం లేదు. విరాట్ కోహ్లీ తనకు తాను విశ్రాంతి తీసుకున్నట్లు కూడా నాకు గుర్తు లేదు. కెప్టెనే విశ్రాంతి తీసుకోనప్పుడు మరీ ఇతరులకు ఎందుకు బ్రేక్ ఇస్తున్నారు?’అని సెహ్వాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. టెస్ట్ సిరీస్‌లో రోహిత్ అద్భుతంగా రాణించాడు. పైగా అతనే టాప్ స్కోరర్. మంచి టచ్‌లో ఉన్నాడు. అలాంటి ఆటగాడని పక్కన పెట్టడం ఏ మాత్రం బాలేదు’అని సెహ్వాగ్
previous post