telugu navyamedia
క్రీడలు వార్తలు

మరో రికార్డు ఖాతాలో వేసుకున్న కోహ్లీ…

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. టెస్టుల్లో ఓ అరుదైన రికార్డ్‌ నెలకొల్పాడు. అయితే ఈ సారి తన ఆటతో కాకుండా.. కెప్టెన్సీతో సరికొత్త ఫీట్​ను అందుకున్నాడు. సుదీర్ఘ ఫార్మాట్​లో టీమిండియాకు అత్యధిక మ్యాచ్​ల్లో సారథ్యం వహించిన ఆటగాడిగా కోహ్లీ రికార్డుల్లోకెక్కాడు. దీంతో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ రికార్డు బద్దలయింది. ఇప్పటివరకు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీతో సమానంగా 60 టెస్ట్​ల్లో భారత్​కు నాయకత్వం వహించాడు విరాట్ కోహ్లీ. ఇక నిన్న సౌథాంప్టన్​ వేదికగా న్యూజిలాండ్​తో జరుగుతోన్న డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్​తో కోహ్లీ.. 61వ టెస్ట్​లో టీమిండియాకు సారథ్య బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. దీంతో మహీ రికార్డును కోహ్లీ బ్రేక్ చేశాడు. 2014లో టెస్టులకి రిటైర్మెంట్ ప్రకటించిన ధోనీ.. భారత్ తరఫున 60 టెస్టులకి కెప్టెన్సీ వహించాడు. ధోనీ రిటైర్మెంట్ తర్వాత టెస్టు పగ్గాలు అందుకున్న కోహ్లీ.. అతడినే అధిగమించాడు. టీమిండియాకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్​గానూ విరాట్ తొలి స్థానంలో ఉన్నాడు. 61 టెస్ట్​ల్లో భారత్​కు నాయకత్వం వహించి 36 మ్యాచ్​లు గెలిపించాడు. మరో 14 మ్యాచ్​లు ఓడిపోగా.. 10 మ్యాచ్​లను డ్రాగా ముగించాడు.

Related posts