ప్రపంచంలోనే అత్యంత విలువైన వస్తువు బంగారం. ఇండియాలో బంగారానికి ఉన్న డిమాండ్ మరేదానికి లేదు. ఎందుకంటే మనదేశంలో మహిళలు ఎక్కువగా బంగారం కొనడానికే ఇష్టపడతారు. దీంతో మన దేశంలో బంగారం ధరలు ఎప్పుడు ఎక్కువగానే ఉంటాయి. అందుకే కరోనా టైంలోనూ బంగారం ధరలు ఆమాంతం పెరిగాయి. అయితే…బులియన్ మార్కెట్‌లో వారం రోజులుగా స్థిరంగా ఉన్న బంగారం ధరలు తాజాగా తగ్గాయి. హైదరాబాద్ విషయానికి వస్తే.. బంగారం ధరలు ఇవాళ తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 540 తగ్గి రూ. 48,930 కు చేరగా… అలాగే 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 500 తగ్గి రూ. 44,850 పలుకుతోంది. బంగారం ధరలు తగ్గగా.. వెండి ధరలు కూడా తగ్గాయి. కిలో వెండి ధర రూ.1,100 తగ్గి రూ.75,100 వద్ద కొనసాగుతోంది.