ఈటల రాజేందర్ బర్తరఫ్ పై బీజేపీ నేత విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బర్తరఫ్ లాంటి పనులు తెలివి తక్కువ పనులని..అర్థరాత్రి కేసీఆర్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం దారుణమన్నారు. “ఈ టీఆరెస్‌లో సస్పెన్షన్, బర్తరఫ్ లాంటి దిమాక్ తక్కువ, మానసిక సమతుల్యత లేని, స్వకుటుంబ స్వార్థపు నిర్ణయాలు అన్నీ అకాలపు…. అర్థంపర్థం లేని అపరాత్రి ప్రజా సమయపు వేళల్లో తీసుకోవడం కేసీఆర్ గారి ధోరణి అని ఈటల గారి వ్యవహారంలో మరో మారు తెలంగాణ ప్రజలకు ఇయ్యాల అర్థమైంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి ఈ నిర్ణయం మిగతా తెలంగాణ కబ్జాదారులు, అవినీతిపరులైన ప్రతి టీఆరెస్ నేత పైన కూడా సమన్యాయంతో పాటించబడుతుందని అభిప్రాయపడుతున్నాను.” అంటూ విజయశాంతి ఫైర్ అయ్యారు.
previous post
next post

