telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

విజయ్‌ దేవరకొండను చూడగానే .. బోరుమన్న అభిమాని.. ఓదార్చిన హీరో..

vijay devarakonda with his emotional fan

నటుడు విజయ్‌ దేవరకొండకు యువత లో ఉన్న ఫాలోయింగ్‌ గురించి అందరికి తెలిసిందే. అబ్బాయిల్లో కంటే అమ్మాయిల్లోనే విజయ్‌కు క్రేజ్‌ ఎక్కువ. అయితే తాజాగా ఓ మహిళా అభిమాని విజయ్‌ను చూడటంతో ఎమోషన్‌ అయ్యారు. తన అభిమానాన్ని ఎలా చెప్పాలో తెలియక ఆనందంతో బోరున విలపించారు. ఇది గమనించిన విజయ్‌ ఆ అమ్మాయిని దగ్గరకు తీసుకుని ఓదార్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

విజయ్‌ తన తాజా చిత్రం డియర్‌ కామ్రేడ్‌ ప్రమోషన్‌లో భాగంగా చెన్నై, బెంగళూరు, కొచ్చి, హైదరాబాద్‌లలో మ్యూజిక్ ఫెస్టివల్స్ నిర్వహించారు. అప్పుడే ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా తెలుస్తోంది.

Related posts