telugu navyamedia
సినిమా వార్తలు

ర్యాప్ సంగీత కళాకారులకు రణవీర్ సింగ్ ప్రోత్సాహం

Ranveer-Singh

ప్రముఖ బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనెను గత సంవత్సరం పెళ్ళి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే రణ్వీర్ సింగ్ విభిన్న చిత్రాల్లో తన నట ప్రతిభను కనబరిచి మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇటీవల ఆయన చేసిన “గల్లీ బాయ్” సినిమాతో ర్యాప్ సంగీతానికి పెద్ద పీట వేశారు. ఈ సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధించింది. సినిమాల ద్వారానే కాకుండా తన సంస్థ ఇంక్ ఇంక్ ద్వారా రాప్ మరియు హిప్ హాప్ కళాకారులకు మంచి ప్రోత్సాహాన్ని అందిస్తున్నారు రణ్వీర్ సింగ్. తద్వారా పలు చిత్రాలు, బ్రాండ్లు ఈ కొత్త తరహా సంగీతానికి తగిన ప్రాధాన్యతనిస్తున్నాయి. గల్లీ బాయ్` చిత్రంలో రణ్వీర్ సింగ్ అత్యద్భుతమైన నటనను ప్రదర్శించి థియేటర్లలో కాసుల వర్షం కూడా కురిపించారు. ఇప్పుడు సంగీతాన్ని, కళాకారులని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఇంక్ ఇంక్ అనే మ్యూజిక్ సంస్థను స్థాపించారు. ఈ సంస్థ ద్వారా హిప్ హాప్ కళాకారులైన కామ్ భారీ, స్లో చీతా, స్పిట్ ఫైర్ పరిచయం అవుతున్నారు. కొద్ది ప్రాంతాలకే పరిమితమైన సంగీత ప్రక్రియను శ్రోతలకు చేరువగా తీసుకెళ్లే ప్రయత్నమే ఇది. చలన చిత్రాలు, వ్యాపార సంస్థలు, రాజకీయ పార్టీలు సైతం రాప్, హిప్ హాప్ సంగీతాన్ని వారి ప్రచారాల్లో ఉపయోగించుకుంటున్నాయి.

Related posts